యువనటుడు నాగశౌర్య హీరోగా కొంతకాలంగా రూపోందుతున్న 'లక్ష్య' సినిమాకు చిత్రయూనిట్ ఇవాళ గుమ్మడికాయ కొట్టేసింది. కరోనా కారణంగా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తాజాగా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేశామనీ, త్వరలో థియేటర్లకు తీసుకొచ్చే దిశగా పనులు మొదలయ్యాయని మేకర్స్ తెలియజేశారు.
నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమైంది. కెరియర్ పరంగా నాగశౌర్యకి ఇది 20వ సినిమా. ఈ సినిమాలో ఆయన సిక్స్ ప్యాక్ తో కూడిన కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో కేతిక శర్మ ఆయనతో జోడీ కడుతోంది. జగపతిబాబు .. సచిన్ కేడ్కర్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more