F3 Is Not A Continuation Of F2: Anil Ravipudi ఎఫ్-3 సీక్వెల్ కాదంటున్న దర్శకుడు అనీల్ రావిపుడి

F3 is not a sequel of f2 clarifies director anil ravipudi

F2, F3, Sequel, continuation, Predecessor, Anil Ravipudi, Dil Raju, Venkatesh, VArun Tej, Tammannah batia, Mehreen, Sunil, Tollywood, Movies, Entertainment

Anil Ravipudi, the highly successful director in the Telugu film industry, is aiming to continue this success streak with his upcoming project F3. It is a sequel to his 2019 film F2. However, Anil says that F3 is not a continuation of its predecessor. He says that the story is completely different but the soul of it remains intact.

‘ఎఫ్ 3’ టైటిల్ మాత్రమే సీక్వెల్.. మిగతాదంతా ఢిఫరెంట్

Posted: 08/09/2021 07:51 PM IST
F3 is not a sequel of f2 clarifies director anil ravipudi

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ దర్శకులలో అనిల్ రావిపూడి మార్క్ వేరు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ నూటికి నూరుపాళ్లు విజయవంతం అయ్యాయి. తెలుగు నాట సక్సెస్ ఫుల్ దర్శకులలో ఒకరుగా ముద్రవేసుకున్న అనిల్ రావిపూడి.. అదే తరహాలో సక్సెస్ ఫుల్ నిర్మాత జాబితాలో నిలిచినవారిలో ఒకరైన.. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో గతంలో వచ్చిన 'ఎఫ్ 2' చేసిన సందడి అంతా ఇంతా కాదు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది.

భార్యాభర్తలు పెళ్లైన కొత్తలో ఎలా ఉంటారు? ఆ తరువాత ఎలా మారిపోతారు? అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అందువలన భారీ వసూళ్లను రాబట్టింది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, వారి కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అనిల్ రావిపూడి కెరియర్ కి మరింత బూస్ట్ ను ఇచ్చింది. దాంతో ఆయన 'ఎఫ్ 3' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జోరుగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో 'ఎఫ్ 2'కి ఈ సినిమా సీక్వెల్ అని అంతా చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై అనిల్ రావిపూడి స్పందిస్తూ.. " ఇది 'ఎఫ్ 2' సినిమాకి కొనసాగింపు కానే కాదు. కథ .. కథనం .. పాత్రలు .. వాటి నేపథ్యాలు పూర్తిగా మారిపోతాయి. ప్రధానమైన కథా వస్తువు పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. వినోదాన్ని పంచే విషయంలో తప్ప, మరెక్కడా 'ఎఫ్ 2'ను టచ్ చేయడం జరగలేదు. ఈ సినిమాలో కొత్తగా వచ్చి చేరింది సునీల్ మాత్రమే. ఆయన కామెడీ ఈ సినిమాకి బోనస్" అంటూ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : F2  F3  Sequel  continuation  Predecessor  Anil Ravipudi  Dil Raju  Venkatesh  VArun Tej  Tollywood  

Other Articles