బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. వాటికి ఇదివరకే మంచి రెస్పాన్స్ రావడంతో ఇవాళ తాజాగా జ మూవీ ట్రైలర్ ను యంగ్ హీరో సుధీర్‌బాబు విడుదలచేసి యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సాగే ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ట్రైయిలర్ ఆద్యంతం భయాత్మకంగానే వుంది. ఇందులో జబర్ధస్త్ కమేడియన్ హీరో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు కూడా నటించడం.. అదనపు అట్రాక్షన్ గా మారుతోంది. ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ.. ‘‘ఫుల్ లెంగ్త్ ఫెర్‌ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాను అంగీకరించాను.
నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే మూవీ ఇది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గోవర్ధన్ రెడ్డి గారికి, దర్శకుడు సైదిరెడ్డి గారికి కృతజ్ఞతలు" అన్నారు. దర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ..‘జ’అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి కథా బలం ఉన్న మూవీ. మా ప్రొడ్యూసర్ గోవర్ధన్ రెడ్డి నా మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉపేందర్ సహకారం మరువలేనిది’ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more