Allu Arjun's daughter Arha to debut in ‘Shakuntalam’ సమంత ‘శాకుంతలం’తో తెరంగ్రేటం చేస్తున్న అల్లు అర్హ

Allu arha to make acting debut with samantha akkineni s shakuntalam

Allu Arjun daughter, shaakuntalam, allu arha, allu arha shaakuntalam, samantha akkineni, shaakuntalam movie, allu arjun allu arha, Allu Arjun, Allu Arha, Shakuntalam, Samantha Akkineni, Gunashekhar, Neelima Guna, Tollywood

Actor Allu Arjun took to Twitter to announce that his daughter Allu Arha is all set for her acting debut with upcoming Telugu magnum opus, Shakuntalam, which stars Samantha Akkineni in the lead. In a post, Arjun announced that Arha will be the fourth-generation actor from their family.

సమంత ‘శాకుంతలం’తో తెరంగ్రేటం చేస్తున్న అల్లు అర్హ

Posted: 07/15/2021 09:57 PM IST
Allu arha to make acting debut with samantha akkineni s shakuntalam

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అమె చిన్న వయస్సులోనే తన ముత్తాతను ఫాలో అవుతున్నారు. అల్లు ఫ్యామిలీ నుండి మరో నటి రాబోతుంది. అది ఎవరో కాదు అల్లు అర్హ. అదేంటి అంటారా.. ఏకంగా చిత్రపరిశ్రమలో తెరంగ్రేటం చేయనున్నారు. ఇప్పటి వరకు తన క్యూట్ మాటలతో అభిమానులకు ఆకట్టుకున్న అర్హను త్వరలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయాలని సన్నాహాలు చేస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు అర్హను వెండితెరమీదకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడని.. నూతన దర్శకుడు సురేష్ పూర్తిగా పిల్లల కాన్సెప్ట్ తో సాగే సినిమాతో అర్హ ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు. కానీ.. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అర్హ ఎంట్రీ ఖరారైంది. గుణశేఖర్ ఇటీవల శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని రూపోందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్హ ఓ కీలకపాత్రలో నటించనుందని సినిమా యూనిట్ ప్రకటించింది.

అల్లు అర్హ ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందట. అర్హ సెట్స్ లో చేరగా మొత్తం 10 రోజుల పాటు శాకుంతలం షూటింగ్‌లో పాల్గొంటుందట. ఈ సినిమా మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల అద్భుతమైన, అందమైన ప్రేమ కథ ఆధారంగా రూపోందుతుండగా మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నారు. కేరళలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న దేవ్ మోహన్ తో పాటు భారీ తారాగణం ఈ సినిమాలో భాగంకానుంది. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిచనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Allu Arha  Shakuntalam  Samantha Akkineni  Gunashekhar  Neelima Guna  Tollywood  

Other Articles