Prabhas-Nag Ashwin’s sci-fi film delayed to next year కరోనా కారణంగా వాయిదా పడిన ప్రభాస్ - నాగ్ అశ్విన్ చిత్రం

Prabhas sci fi film directed by nag ashwin postponed to next year

prabhas, prabhas' movies, prabhas' next, prabhas and nag ashwin, nag ashwin, Science Fiction movie, saalar, Adipurush, Radhe Shyam, Deepika padukone, Tollywood,m Movies, Entertainment

Indian actor Prabhas much-awaited science fiction movie directed by Nag Ashwin has been postponed. As per reports the shoot of the movie was to begin in July but was postponed due to Prabhas' busy schedule. The movie will now begin shooting in 2022 and reportedly release in 2023. Pan Indian star is currently busy shooting for his movie Adipurush and Saalar. Ashwin's untitled project also features Bollywood actress Deepika Padukone in the lead role.

కరోనా కారణంగా వాయిదా పడిన ప్రభాస్ - నాగ్ అశ్విన్ చిత్రం

Posted: 05/21/2021 02:21 PM IST
Prabhas sci fi film directed by nag ashwin postponed to next year

పాన్ ఇండియా స్టార్, రెబెల్ స్టార్ ప్రభాస్ తో చిత్రం తీసేందుకు ఇటు దక్షిణాధి దర్శకులే కాదు అటు బాలీవుడ్ దర్శకులు కూడా కథలను రెడీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే చేతిలో పలు చిత్రాలు వుండటం.. దానికి తోడు వాటిలో పలు చిత్రాలు షూటింగ్లు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో పలు దర్శకులను ప్రభాస్ వెయిటింగ్ లో పెట్టారు. అలాంటి దర్శకులలో మహానటి చిత్రంలో తన కెపాసిటీని తెలుగు సహా దక్షిణాది ప్రేక్షకులకు చూపిన నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ తో చిత్రానికి మరో ఏడాది వెయిట్ చేయక తప్పని పరిస్తితులు నెలకోన్నాయి.

ప్రభాస్ తో ఒక సైన్స్ ఫిక్షన్ కథను చేయనున్నట్టుగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ మధ్య చెప్పారు. పాన్ ఇండియా సినిమాకి సరైన అర్థం చెప్పేలా ఈ ప్రాజెక్టు ఉంటుందని అన్నారు. దీంతో సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏర్పడ్డాయి. రాధే శ్యామ్' .. 'సలార్' .. 'ఆది పురుష్' తరువాత ప్రభాస్ ఈ సినిమా చేయనున్నాడని చెప్పగానే, కాస్త ఆలస్యమైనా ప్రభాస్ నుంచి మరో అద్భుతమైన సినిమా రానున్నందుకు అభిమానులు ఖుషీ అయ్యారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

అయితే తన ప్రాజెక్టు లేట్ అవుతున్నందుకు నాగ్ అశ్విన్ అసంతృప్తికి లోనుకావడం లేదట. స్క్రిప్ట్ పై మరింత శ్రద్ధ పెట్టి, ఒక రేంజ్ లో కసరత్తు చేస్తున్నాడట. ప్రస్తుతం జరుగుతున్న ఆలస్యాన్ని వర్క్ పరంగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నాడని చెబుతున్నారు. ఇక సెట్స్ పైకి వెళ్లిన తరువాత సమయం వృథా కాకుండా .. దేని గురించిన వెతుకులాట లేకుండా ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు. ఈ సమయాన్ని ప్రాజెక్టును మరింత స్పీడ్ గా పూర్తి చేయడానికి ఆయన వినియోగించుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas  nag ashwin  Science Fiction movie  saalar  Adipurush  Radhe Shyam  Deepika padukone  Tollywood  

Other Articles