Suspence Thriller Y trailer launched ఉత్కంఠ రేపుతున్న ‘వై’ చిత్ర ట్రైలర్

Suspence thriller y trailer launched

Y, Y trailer, sriram, Rahul Ramakrishna, Akshaya Chander, Gemini Suresh, TNR, Deviyani Sher, Baalu Adusumilli, Vikas Badisa, Tollywood, movies, Entertainment

Sriram playing for the first time in a negitive shades in the Suspence Thriller movie "Y'. The trailer launched today is exicting to watch. Rahul Ramakrishna plays as a writer and aspirant for directing a movie.

ఉత్కంఠ రేపుతున్న ‘వై’ చిత్ర ట్రైలర్

Posted: 03/31/2021 08:40 PM IST
Suspence thriller y trailer launched

ట్రైలర్ ఓపెన్ చేస్తే.. ‘‘నీకు తెలిసిన ఓ మంచి రైటర్ ఎవరైనా వుంటే చెప్పు’’ అంటూ ఓ లేడీ ఓ వ్యక్తికి చెబుతోంది. దాంతో అతను సార్ స్పీడుకు తగ్గ రైటర్ ను తీసుకువచ్చి మీ ముందు పెట్టే బాధ్యత నాది’’ అంటూ అసురెన్స్ ఇస్తాడా వ్యక్తి. కట్ చేస్తే రాహుల్ రామకృష్ణను రైటర్ గా పరిచయం చేస్తారు. జనరల్ గా మీలెంటి జోనర్ ప్రిఫర్ చేస్తావ్.? అని అడగ్గానే క్రైమ్ అని ఠక్కున సమాధానం చెబుతాడు రామకృష్ణ. క్రైమ్ లో ఎదైనా కొత్త పాయింట్ చెప్పగలవా.? అని శ్రీరామ్ ప్రశ్నించగానే.. ఓపెన్ చేస్తే అని రాహుల్ రామకృష్ణ తన స్టోరీని చెబుతాడు.

అక్కడ కట్ చేస్తే.. శ్రీరామ్ తో కలసి హోమం చేయిస్తున్న అతని భార్యతో పండితుడు మాట్లాడుతూ.. నీ భర్త గారి జాతకంలో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందని చెబుతాడు. కట్ ఛేస్తే స్టోరి నచ్చిన శ్రీరామ్ రాహుల్ రామకృష్ణను ఏం ఎక్స్ ఫెక్ట్ చేస్తున్నావ్ అని ప్రశ్నించగా, నేనేంటో మీకు ప్రూవ్ చేసి చూపిస్తా సార్.. అని నమ్మకంగా చెబుతాడు. కట్ చేస్తే నిన్నటి వరకు నాతో సినిమా చేస్తే గోప్ప అని తిరిగేవాడివి.. అని శ్రీరామ్ అన్న మాటలకు.. ఫ్రెండ్ కదా అని నమ్మితే ద్రోహం చేస్తావా.? అంటూ నిలదీస్తున్నాడు రాహుల్ రామకృష్ణ.

లోపల ఒకడు కెలికేస్తున్నాడు సార్.. అడగోచ్చా.. అని ఆ తరువాత చివర్లో ‘పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించడానికి ప్రతి వాడూ పూరి జగన్నాథ్‌ కాదు కదా సర్‌’ అంటున్నారు రాహుల్‌ రామకృష్ణ. నటుడు శ్రీరామ్‌తో కలిసి ఆయన నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘వై’. బాలు అడుసుమిల్లి దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో శ్రీరామ్‌ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథా, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఏప్రిల్‌ 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Y  Y trailer  sriram  Rahul Ramakrishna  Akshaya Chander  Deviyani Sher  Baalu Adusumilli  Vikas Badisa  Tollywood  

Other Articles