రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో హిందీలో ‘హథీ మేరీ సాథీ’, తమిళ్లో ‘కాడన్’ పేర్లతో రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ‘అరణ్య’ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా, ఎమోషనల్‌గా సాగింది.. ఎన్నాళ్లనుండో అడవితో అనుబంధం ఉన్న మనుషులను రాజకీయ పలుకుబడితో అడవి నుండి దూరం చెయ్యడానికి చేసే ప్రయత్నాలు, వాటిని ఎదుర్కొని అడవిని సంరక్షించడానికి హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సినిమా కథ అని క్లుప్తంగా చెప్పారు.
రానా నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో చాలా డిఫరెంట్‌గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఎ.ఆర్. అశోక్ కుమార్ విజువల్స్, శాంతను మొయిత్రా, జార్జ్ జోసెఫ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి మరింత అందం తెచ్చాయి. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీగా తెరకెక్కించిన ‘అరణ్య’ మార్చి 26న తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more