'House Arrest' Teaser: Kids house-arrest thieves చిచ్చరపిడుగుల చేతిలో గజదొంగల ‘హౌజ్ అరెస్ట్’

House arrest teaser kids house arrest thieves

House Arrest Teaser, Srinivas Reddy, Saptagiri, Allari Ravi Babu, Adhurs Raghu, Ravi Prakash, Sunayana, Thagubothu Ramesh, SekharReddy Yerra, Anup Rubens, K Niranjan Reddy, tollywood, Moives, Entertainment

In the teaser for 'House Arrest', comedians Srinivas Reddy and Saptagiri break into a house with the intention of stealing stuff. But when they see a group of five kids in the house, they decide to make a quick buck by abducting them. With their parents away, the smart kids decide to befool them by house-arresting them.

చిచ్చరపిడుగుల చేతిలో గజదొంగల ‘హౌజ్ అరెస్ట్’

Posted: 02/27/2021 05:23 PM IST
House arrest teaser kids house arrest thieves

ప్రముఖ హా‌స్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ కూడా నటిస్తున్నారు. ‘90 ఎంఎల్’ చిత్ర దర్శకుడు శేఖర్‌రెడ్డి ఎర్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ ను ఇవాళ చిత్ర యూనిట్ విడుదలైంది. ‘‘సార్‌ మా మొగుళ్లు తప్పిపోయారు’’ అంటూ టీజర్‌ ప్రారంభమవుతోంది. వీళ్లంతా నగరంలో పేరుమోసిన గజదొంగలు కదా అంటు అటువైపు నుంచి పోలీసుల సమాధానం వినిపిస్తోంది.

అలాంటి వీళ్లను ఎవరు మాత్రం ఏం చేస్తారు.. అనుకునేలోగా.. ఈ నలుగురు ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రవేశిస్తారు. అయితే పెద్దవాళ్లు ఎవరూ లేని ఆ ఇంట్లోకి ప్రవేశించిన వీళ్లను.. అదే ఇంట్లోని ఐదుగురు చిన్నారులు ఆటాడుకుంటూ వారి పన్నగాన్ని పసిగడతారు. దీంతో దొంగతనం చేయడానికి వచ్చిన వీళ్ల.. తమను కిడ్నాప్ చేయకుండా వుండేందుకు అనేక ప్రణాళికలు రచించి వాటిని అమలుపరుస్తారు. ఇందులో భాగంగా ఆ చిన్నారులు ముందుగా బిర్యాని పెట్టి.. ఆతరవాత టార్చర్ పెడతారు.

అయితే పోలీసు అధికారి పాత్రలో వచ్చిన రవిబాబు.. మీ ఇంటికి ఎవరన్నా దొంగలు వచ్చారా.. అని అడగటం.. దానికి మీ ఇంటికి చుట్టాలెవరన్నా వచ్చారా అన్నట్టు అడుగుతారేంటి సార్.. దొంగలేమైనా వస్తే మేమే మీకు ఫోన్ చేస్తాం కదా.. అని సమాధానం రావడంతో.. మరీ ఆ దొంగలు ఏమైయ్యారు అంటూ ప్రశ్నార్థకంగా ముఖాన్ని పెట్టగా.. చిన్నారుల చేతిలో దొంగల హౌస్‌ అరెస్ట్ అయ్యారన్న విషయం అర్థమవుతుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమవుతోన్న చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, శ్రీమతి చైతన్య చిత్రాన్ని సమర్పిస్తున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh