ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేంటి అంటారా.? నిజమేనండీ.. షాహీద్ కపూర్ స్వియ నిర్మాణంలో రూపోందుతున్న వెబ్ సిరీస్ లో ఆయన సరనస రాశీ కన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్ లో అమె ఓ వైపు రోమాన్స్ చేస్తున్నా.. మరోవైపు కిక్ బాక్సింగ్ లోనూ రాణించే సన్నివేశాలు వున్నాయని తెలుస్తోంది.
అందుకోసం రాశీ.. కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోను కూడా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఇదేదో సరదా కోసం ఈ చిన్నది కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం తాను నటిస్తున్న ఓ వెబ్ సీరీస్ కోసం రాశి ఇలా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోంది. ఆ విషయంలోకి వెళితే, ఇప్పుడు చాలామంది కథానాయికలు ఇటు సినిమాలు చేస్తూనే, అటు ఓటీటీ వేదికల కోసం వెబ్ సీరీస్ కూడా చేస్తున్నారు. కథానాయిక రాశిఖన్నా కూడా ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సీరీస్ చేస్తోంది.
ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సరసన ఆమె జంటగా నటిస్తోంది. ఈ సీరీస్ కోసమే తాను కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ యాల్సి వచ్చిందని రాశి తాజాగా పేర్కొంది. 'ఓ వెబ్ సీరీస్ లో నటించడం ద్వారా చాలా రోజుల తర్వాత మళ్లీ బాలీవుడ్ కి వెళుతున్నాను. ఇందులో షాహిద్ కపూర్ తో కలసి నటించడం హ్యాపీగా వుంది. ఇందులోని పాత్ర కోసమే కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలా కిక్ బాక్సింగ్, వర్కౌట్స్ చేయడం వల్ల మరింత ఫిట్ నెస్ తెచ్చుకోవచ్చు' అని చెప్పింది రాశిఖన్నా.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more