బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది అన్ టోల్డ్ స్టోరి చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రేపిన గాయం ఇప్పటికీ ఆయన అభిమానులను.. బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను వీడి వెళ్లకముందే అదే చిత్రంలో నటించిన మరో నటుడు కూడా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.
ముంబైలోని గార్ గావ్ ప్రాంతంలోని తన స్వగృహంలో సందీప్ ఈ విపరీత చర్యకు పాల్పడ్డాడు. అంతకుముందు ఆయన తన షేస్ బుక్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేయడంలో పాటు సూసైట్ నోట్ కూడా రాసి పెట్టాడు. తన మరణానికి తానే కారణం అంటూ.. తన వ్యక్తిగత సమస్యలతో పాటు భార్యతో విభేదాల కారణంగానే తాను ఈ బలవన్మరణానికి పాల్పడడుతున్నట్లు సూసైడ్ నోట్ లో రాసిపెట్టాడు. పరిస్థితులను ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా తెలియడం లేదని అవేధన వ్యక్తం చేసిన ఆయన.. అందుకనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కోన్నాడు.
కాగా తాను తీసుకుంటున్న ఈ నిర్ణయంతో తన భార్యను నిందించాల్సిన అవసరం లేదని, తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కాదని పేర్కోన్నాడు. ఫేస్ బుక్‌లో అతడి పోస్టు పెట్టిన నిమిషాల వ్యవధిలోనే దానిని చూసిన ఆయన స్నేహితులు ఆత్మహత్యను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా అప్పటికే ఆయన ఆత్మహత్యకు పాల్పడటంతో వారి ప్రయత్నాలకు ఫలితం దక్కలేదు. కాగా ఈ ఆత్మహత్యపై ఆయన స్సేహితుడు బాల్జీత్ భావోద్వేగానికి గురయ్యాడు. సందీప్ చాలా ఎమోషనల్ వ్యక్తి అని.. తాను స్నేహితులతోనూ ఎక్కువగా మాట్లాడడని పేర్కోన్నాడు.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more