Mahesh Babu stands in support of Sharwanand మహేశ్ బాబు విడుదల చేసిన శర్వా ‘శ్రీకారం’

Mahesh babu unveils sharwanand stater sreekaram teaser

Sreekaram, Mahesh Babu, Sharwanand, Priyanaka Arul Mohan, Kishore, Mickey J. Mayer, Ram Achanta, Gopchand Achanta, tollywood, movies, Entertainment

Superstar Mahesh Babu Came to support Sharwanand And unveiled the teaser of the upcoming family entertainer Sreekaram, the Sharavanand starrer. Directed by B Kishore and features Gang Leader fame, Priyanka Arul Mohan as the lead lady, and jointly bankrolled by Ram Achanta and Gopchand Achanta under the banner of 14 Reels Plus Banner.

మహేశ్ బాబు విడుదల చేసిన శర్వా ‘శ్రీకారం’

Posted: 02/09/2021 06:05 PM IST
Mahesh babu unveils sharwanand stater sreekaram teaser

యంగ్ హీరో శర్వానంద్ మరో మంచి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిత్యం విభిన్న కథాంశాల చిత్రాలను ఎంచుకుని ప్రేక్షకులను అకర్షితులను చేస్తున్న ఈ హీరో తాజాగా రైతు సబ్జెక్టును ఎంచుకుని వస్తున్నాడు. తన తాజా చిత్రం శ్రీకారంతో వస్తున్న ఈ హీరో.. ‘‘ఒక రైతు తన కొడుకును రైతుగా ఎందుకు తయారు చేయడం లేదని తనకు జవాబు లేని ప్రశ్నగా మిగిలింది’’ అంటూ ప్రశ్నిస్తున్నాడు. శ్రీకారం చిత్రబృందం ఇవాళ చిత్ర టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ అద్యంతం అలోచనను రేకెత్తించేలా వుంది.

సూపర్‌స్టార్‌ మ‌హేశ్ బాబు చేతుల మీదుగా ఇవాళ చిత్ర టీజర్ విడుద‌లైంది. కిశోర్. బి ద‌ర్శ‌క‌త్వంలో ప్రియాంకా అరుళ్ మోహ‌న్.. శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది. కాగా, ‘మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న శ్రీకారం బృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ మహేశ్‌ టీజ‌ర్‌ను విడుదల చేశాడు. ‘‘ఓ హీరో త‌న కొడుకును హీరో చేస్తున్నాడు. ఒక డాక్ట‌ర్ త‌న కొడుకును డాక్ట‌ర్.. ఒక ఇంజినీర్ త‌న కొడుకు ఇంజినీర్ చేస్తున్నాడు. కానీ ఒక రైతు మాత్రం త‌న కొడుకును రైతును చేయ‌డం లేదు. ఈ ఒక్క‌టి నాకు జ‌వాబు లేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది..’ అంటూ శ‌ర్వానంద్ చెప్పే డైలాగ్‌తో టీజ‌ర్ మొదలైంది.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల నేపథ్యంతో సినిమా తీస్తున్నట్లు టీజర్ లో ఉంది. ‘తినేవాళ్లు నెత్తిమీద జుట్టు అంత ఉంటే.. పండించేవాళ్లు మూతిమీద మీసం అంతమంది కూడా లేరు’ అంటూ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్‌ రాశాడు. కుటుంబ చిత్రంగా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా 14  రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్ పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సంగీతం మిక్కీ జే మేయర్‌ సమకూర్చుతుండగా, ఇప్పటికే ‘సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే’, ‘వస్తానంటివో పోతానంటివో భలేగుంది బాల’ పాటలు విడుదలై మంది అదరణ పోందాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sreekaram  Mahesh Babu  Sharwanand  Priyanaka Arul Mohan  Kishore  Mickey J. Mayer  tollywood  

Other Articles