బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్ ఫర్ ఫెక్ట్ రేంజ్ లో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ' రాధేశ్యామ్' అనే టైటిల్ ను పెట్టింది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అయితే అభిమానులను సంతోషపర్చేందుకు.. ఈ రోజున సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ ప్రి-టీజర్ ను విడుదల చేశారు. ఈ నెల 14న ప్రభాస్ కు సంబంధంచిన ఓ విషయంపై ప్రకటన చేస్తామని చెప్పారు. వ్యక్తిగతంగా కాకుండా సినిమా పరంగానే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం యూనిట్ ప్రకటన చేయనుంది. ఈ వార్తతో అదీ ఏదైనా సరే.. తమ అభిమాన హీరో నుంచి ఓ అప్ డేట్ త్వరలో లభిస్తుందన్న సంతోషం అభిమానుల్లో నెలకోంది. ఇక దీనికి తోడు సంతోషకరమైన వార్తను తెలిపేందుకు కూడా విడుదల చేసిన ప్రీటీజర్ మరింత ఆకట్టకునేలా వుంది.
ఈ ప్రీటీజర్ లో ప్రభాస్ మీకు తెలుసు.. ఓ పోరాట యోధుడిగా, యాక్షన్ హీరోగా, రోమాంటిక్ హీరోగా ఆయన మీకు సుపరిచితుడే.. ఇక ఇప్పుడు ఆయన మనస్సు తెలుసుకోవాలి. అందుకు కూడా సమయం ఆసన్నమైంది. ఆయన మనసేంటో తెలియాలంటే.. ఈ నెల 14 వాలెంటైన్స్ డే.. ప్రేమికుల రోజు మీముందు అవిష్కృతం కానుంది.. అంటూ తాము చేయనున్న ప్రకటనను చూడాల్సిందేనని ఈ ప్రీటీజర్ సారంశం. ఈ మేరకు ప్రీటీజర్ ను కట్ చేసిన రాధేశ్యామ్ టీమ్ 30 సెకన్ల నిడివి గల ప్రీటీజర్ ను కట్ చేసి అభిమానులతో పంచుకుంది.
ఈ ప్రీటీజర్ లో ప్రభాస్ ఓ ప్రేమికుడిగా యంగ్ లుక్ లో కనిపించి ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో సైతం ఈ వీడియో దూసుకెళ్తోంది. గంటల వ్యవధిలోనే ఈ టీజర్ ను అప్పుడే నాలుగు లక్షల మంది వీకించారు. పునర్జన్మలతో ముడిపడిన ఈ కథ .. యూరప్ నేపథ్యంలో రూపొందుతోంది. కాగా మొత్తానికి చిత్రం నుంచి అప్ డేట్ లభించడంతో ప్రభాస్ అభిమానులు సంబరపడుతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ చిత్రాన్ని కృష్ణం రాజు గోపికృష్ణ మూవీస్ పై సమర్పిస్తుండగా, యూవీ క్రియేషన్స్, టీ సీరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more