‘రాజావారు రాణీవారు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాక్సీవాలా ఫేమ్ కథానాయిక ప్రియాంక జువాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు సాయికుమార్, తులసి, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా గురువారం నాడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌లో దాదాపు ముఖ్యమైన పాత్రలన్నింటినీ చూపించారు.
కాలేజ్ చదవుతున్న హీరో అదే సమయంలో తన తండ్రికి మద్దతుగా నిలబడాలని ఎస్ఆర్ కళ్యాణమండపాన్ని ఏర్పాటు చేసి అందులో పెళ్లిళ్లు చేయాలని పూనుకుంటాడు. కానీ కళ్యాణమండపంలో పెళ్లిళ్లు జరగక పోవడం.. పైపెచ్చు గ్రామపెద్దలు అందులో మందు కోడదామని చెప్పడం అద్యంతం నవ్వులు పూయిస్తోంది. ఇక హీరో చెప్పే ప్రారంభ డైలాగ్ కూడా ఆసక్తికరంగా వుంది. ఊళ్లో ఎవరికీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా.. లేక వారికి నడుములు లేవా.. ప్రతీ ఒక్కరికీ నా గర్ల్ ఫ్రెండ్ నడము గురించే కవాల్సోచ్చిందా.. అంటూ మత్తులో మాట్లాడుతుంటాడు.
ఈ చిత్రానికి శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన మూవీ టీజర్ ఆద్యంతం నవ్వులు పంచుతోంది. అటు కళాశాలలో చదువుకునే యువకునిగా, ఇటు కల్యాణమండపాన్ని నడిపే వ్యక్తిగా హీరో పాత్ర ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌ను హీరో సరదాగా ఆటపటిస్తున్న డైలాగ్స్ అలరిస్తున్నాయి. చైతన్య భరద్వాజ్ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరి సరదాగా సాగిపోతున్న ఆ టీజర్‌ను మీరూ చూసేయండి!
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more