దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపోందిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్) నుంచి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. చిత్రం రిలీజ్ డేట్ లాక్ చేసిన నాటి నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన వార్తలు వరుసగా ప్రతీ రోజు వుంటున్నాయి. విడదల తేదీ ఫిక్స్ చేయగానే బాలీవుడ్ నిర్మాత బొనీకపూర్ అసంతృప్తిని వ్యక్తం చేయడం.. ఆ తరువాత నిన్న నీరులో నిప్పు వీడియోను అప్ లోడ్ చేసిన చిత్ర యూనిట్.. ఇక ఇవాళ కూడా మరో స్పెషల్ సర్ ప్రైజ్ ను అభిమానులతో పంచుకుంది.
పాన్ ఇండియా చిత్రంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కీలక పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అమె తారక్ ప్రేయసిగా జెన్నీఫర్ పాత్రలో కనిపించనున్నారు. అమె పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి అమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
చిత్రబృందం అమె ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో అమెకు అభిమానుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లివిరిసాయి. అంతేకాదు ఎన్టీఆర్ కూడా అమె జన్మదినం రోజున శుభాకాంక్షలు తెలుపుతూ ‘‘హ్యాపీ బర్త్ డే డియర్ జెన్నీఫర్’’ అని ట్వీట్ చేశారు. ఇక దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్, మరోవైపు జక్కన్న అభిమానులు అమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇలా ఒలీవియా మోరిస్ కు ఇండియా వ్యాప్తంగా తొలిసారిగా పెద్ద సంఖ్యలో బర్త్ డే విషెస్ వెల్లివిరుస్తున్నాయి. ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తుండగా, చిత్రాన్ని డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more