RRR's Work Will Resume Soon: MM Keeravani ఆర్ఆర్ఆర్ అప్ డేట్: నవంబర్ నుంచి షూటింగ్ షూరు..!

Rrr work will resume soon music composer m m keeravaani on ss rajamoulis rrr

RRR, Ram Charan, Junior NTR, SS Rajamouli, Alia bhatt, Ajay Devgn, MM Keeravani, RRR Update, RRR latest Update, Entertainment, movies, Tollywood

'RRR' is one of the most anticipated films of the year.'RRR' was scheduled to release in July but now it got pushed to next year. Keeravani concluded his tweet with the much-awaited update on RRR saying 'RRR work will be resumed soon.' The period film features Jr NTR, Ram Charan, Alia Bhatt, Ajay Devgn, Ray Stevenson, Olivia Morris and Allison Doody in pivotal roles.

ఆర్ఆర్ఆర్ అప్ డేట్: నవంబర్ నుంచి షూటింగ్ షూరు..!

Posted: 09/23/2020 03:06 AM IST
Rrr work will resume soon music composer m m keeravaani on ss rajamoulis rrr

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ రూపోందుతున్న విషయం తెలిసిందే. ఈ నెల జూలైలో విడుదల కావాల్సిన చిత్రం ఆ తరువాత జక్కన నిర్ణయంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన లాక్ ఔట్ కారణంగా యావత్ దేశంతో పాటుగా సినిమా రంగానికి కూడా తాళాలు పడ్డాయి, కాగా తాజాగా అన్ లాక్ 4.0 మార్గదర్శకాల్లో సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో మెల్లిమెల్లిగా సినిమా రంగం కూడా గాడిన పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇదివరకే పలు చిత్రాలు తమ షూటింగ్ ను ప్రారంభించడంతో.. ఇటు దర్శక దిగ్గజం కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు రెడీ అవుతున్నాడని.. ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ప్రకటించారు. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించి ముందుగా అలియా భట్ కాంబినేషన్లో వున్న సన్నివేశాల చిత్రీకరణని పూర్తిచేయాలని రాజమౌళి నిర్ణయించినట్టు సమాచారం. ఆమె మరో చిత్రానికి డేట్స్ ఇచ్చిన కారణంగా వెళ్లాల్సి వస్తుందని, అందుచేత సినిమాలోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగించాల్సిందిగా అమెను రాజమౌళిని కోరినట్టు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన విషయాన్ని కీరవాణి ప్రకటించారు.

ఇందుకోసం ఆలియా భట్‌ నవంబర్, డిసెంబర్ రెండు నెలలు పూర్తిగా ఆర్ఆర్‌ఆర్‌ కోసమే డేట్లు కేటాయిస్తానని అందుకు తగ్గట్టు షెడ్యూల్ రెడీ చేసుకోవాలని కూడా దర్శకుడికి తెలిపినట్లు సమాచారం. ఒకవేళ ఆ నెలలో కుదరకపోతే మళ్ళీ డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టమవుతుందని ముందుగానే ఒక కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అలియా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయట.అందుకే రాజమౌళి షూటింగ్ కి రెడీ ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. ఇంతవరకు బాగానే వున్నా రాజమౌళికి తాజాగా కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావడంతో ఆయన ఎలా అన్నింటినీ అడ్జస్ట్ చేస్తారో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RRR  Ram Charan  Junior NTR  SS Rajamouli  Alia bhatt  Ajay Devgn  MM Keeravani  RRR latest Update  Tollywood  

Other Articles