Senior actress Sita last rites completed నటశిరోమణి, సీనియర్ నటి సీత అంత్యక్రియలు పూర్తి

Senior actress sita last rites completed at mahaprasthanam

Sita, Veteran Telugu actress, Senior actress Sita, Raktha Kanneeru, Nagabhushanam, Mayabazar, golden era of Telugu cinema, comic roles, Tollywood, Entertainment

Senior actress Sita who is popular for her supporting roles in the golden era of Telugu cinema has passed away in Hyderabad, and her final rites have been performed at the Vaikunta Mahaprasthanam. The 87-year-old who has been suffering from age-related illness is the second wife of legendary Telugu actor Nagabhushanam.

నటశిరోమణి, సీనియర్ నటి సీత అంత్యక్రియలు పూర్తి

Posted: 09/23/2020 02:10 AM IST
Senior actress sita last rites completed at mahaprasthanam

టాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. సీనియర్ నటి సీత (87) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న హైదరాబాదులో మృతి చెందారు. ఇవాళ ఆమె కుటుంబసభ్యులు అమె అంత్యక్రియలు హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టా మహాప్రస్థానంలో నిర్వహించారు. పౌరాణిక, సామాజిక చిత్రాలలో నటించిన అమె 2002లోనూ క్యారెక్టర్ పాత్రలో నటించి మెప్పించారు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నుంచి రంగు చిత్రాలు, సినిమా స్కోప్ చిత్రాలు, 70 ఎంఎం చిత్రాలు, స్టీరియోఫోనిక్, డాల్బీ డిజిటల్ చిత్రాల వరకు అన్ని చిత్రాలలోనూ అమె నటించి మెప్పించారు.

నటి సీత ‘యోగి వేమన’ సినిమాతో బాల నటిగా తెరంగేట్రం చేసిన ఆ నట శిరోమణి.. ప్రముఖ నటుడు నాగభూషణంను 1956లో వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె భువనేశ్వరి, కుమారుడు సురేందర్ ఉన్నారు. అలనాటి మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి తదితర సినిమాల్లో ఆమె నటించారు. హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి సీత.. 2002లో చివరిసారి ‘నేనేరా పోలీస్’ సినిమాలో కనిపించారు. సుమారు 250 సినిమాల్లో నటించిన సీత.. 2 వేల వరకు నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రుతురాగాలు వంటి బహుళ ప్రేక్షకాదరణ పొందిన ధారావాహికల్లోనూ నటించి మెప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles