Ansh Bagri Attacked Outside New Delhi Home టీవీ నటుడిపై పది మంది దాడి.. ఇంట్లోకి చోచ్చుకెళ్లి..

Tv actor ansh bagri badly beaten up by 10 men in delhi

actor, Ansh Bagri, celebrity, delhi police, Dil Toh Happy Hai Ji, Paschim Vihar, TV actor, Covid 19, Coronavirus, lockdown, Bollywood, tollywood, movies, Entertainment

TV actor Ansh Bagri was reportedly assaulted by a group of men outside his residence in Paschim Vihar, New Delhi. As per a website, Ansh had returned home from his film shooting in Punjab a few days ago. On last Saturday, he was beaten up by a group of men right outside his residence. As a result of the attack, Ansh has sustained head injuries.

టీవీ నటుడిపై పది మంది దాడి.. ఇంట్లోకి చోచ్చుకెళ్లి..

Posted: 07/28/2020 09:43 PM IST
Tv actor ansh bagri badly beaten up by 10 men in delhi

హిందీ నటుడు అన్ష్ బగ్రీపై దేశరాజధానిలో దాడి జరిగింది. గుర్తుతెలియని పది మంది అగంతకులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన ఇంటి ఆవరణలోకి చోచ్చుకుని వచ్చిన అగంతకులు.. అకారణంగా అతనిపై దాడి చేసి గాయపర్చారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో అగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. అగంతకులను అరెస్టు చేయాలని, ఈ దాడి వెనుకనున్న పెద్దలను కూడా కటకటాల్లోకి పంపిస్తే కానీ తాను ప్రశాంతంగా వుండలేనని అంటున్నాడు ఈ నటుడు. తాను షూటింగుల కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన పక్షంలో అగంతకులు ఇలాగే తన తల్లి, చెల్లిపై కూడా దాడి చేసే అవకాశాలు వున్నాయని భయాందోళన చెందుతున్నాడు.

అన్ష్ బగ్రీ హిందీ టీవీ సీరియల్స్‌తో పాటు పలు కార్యక్రమాల్లో నటిస్తూ ఉంటారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని పశ్చిమ విహార్లో తన తల్లిదండ్రులతో కలసి నివాసం ఉంటున్నాడు. కాగా కొద్ది రోజుల క్రితం అన్ష్ నివాసానికి చేరుకున్న 10 మంది దుండగులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అన్ష్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్స్‌ తన ఇంటిని నిర్మించేందుకు ఓ కాంట్రాక్టర్ ను మాట్లాడుకున్నాడు. అయితే అనుకున్న సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో పాటు మరికొంత డబ్బును కాంట్రాక్టర్ డిమాండ్ చేశాడు.

దీంతో చిరెత్తుకోచ్చిన అన్ష బగ్రీ అతడ్ని కాంట్రాక్టర్ గా తొలగించాడు. ఈ క్రమంలో మరో కాంట్రాక్టర్ తో నిర్మాణ పనులను చేయిస్తున్నాడు. దీంతో అన్ష్ బగ్రీపై కక్ష పెంచుకున్న కాంట్రాక్టర్ అన్ష్ ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుంటాడా అని వేచిచూసి.. సరిగ్గా శనివారం రోజున నటుడు పంజాబ్ నుంచి ఇంటికి చేరుకున్న తరువాత పది మందిని పురమాయించి తనపై దాడి చేయించాడని అన్ష్ పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోన్నాడు. అంతేకాదు ఘర్షణ జరుగుతున్న సమయంలోనూ అతను తన ఇంటి వద్దకు వచ్చి.. తనపై దాడిని అతడి మోబైల్ లో చిత్రీకరించాడని కూడా అన్ష్ అరోపిస్తున్నాడు. ఇంత జరుగుతున్న చుట్టుపక్కనున్నవాళ్లు ఎవరూ రాకపోవడం, కనీసం వివాదాన్ని అపకపోవడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles