Shivaji Raja Suffers Heart Attack, stable నటుడు శివాజీరాజాకు హార్ట్ స్ట్రోక్.. అసుపత్రిలో చేరిక

Telugu actor shivaji raja hospitalised in hyderabad

shivaji raja, star hospitals, Heart stroke, Actor shivaji raja, shivaji raja hospitalised, shivaji raja icu wing, hyderabad, tollywood, movies, entertainment

Telugu actor Shivaji Raja was admitted to Star Hospitals on Tuesday after he reportedly complained of chest pain. The actor was taken to the emergency department of the Star Hospitals. The actor is in the hospital’s ICU wing but is reportedly in a stable condition.

నటుడు శివాజీరాజాకు హార్ట్ స్ట్రోక్.. అసుపత్రిలో చేరిక

Posted: 05/05/2020 09:57 PM IST
Telugu actor shivaji raja hospitalised in hyderabad

సినీనటుడు, మా అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. ఆకస్మికంగా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుఠాహుఠిన ఆయన్ను స్టార్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడే ప్రస్తుతం ఈయనకు చికిత్స కొనసాగుతుంది. శివాజీ రాజాను క్రిటికల్ కేర్ వార్డుకు తరలించిన వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించిన తరువాత చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూ వార్డులో వున్నారని.. ఆయన అరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు. ఆయన అరోగ్యంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గతేడాది మా అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు ఈయన. ఈ విషయంపై శివాజీ రాజా స్నేహితుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఇప్పుడే ఆయనతో మాట్లాడాను.. బిపి డౌన్ అయిపోయి హార్ట్ఎటాక్ వచ్చింది.. స్టంట్ వేస్తారని చెప్పారని క్లారిటీ ఇచ్చాడు.  కొన్ని రోజులుగా సొంత ఫామ్ హౌజ్ లో కూరగాయలు పండిస్తూ సినిమా కార్మికులకు ఉచితంగా పంచి పెడుతున్నాడు. అయితే ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది.

కాగా శివాజీ రాజా దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ వందల సినిమాల్లో నటించాడు. శివాజీ రాజా అటు బుల్లితెరపై కూడా మెరిసాడు. అమృతం సీరియల్ తో టీవీ ప్రేక్షకులను నవ్వించాడు. కామెడీతో పాటు క్యారెక్టర్ రోల్స్ వేస్తున్న శివాజీ.. మా అసోసియేషన్ ఎన్నికలలో ఆయనతో పాటు పనిచేసిన నటులు తాజాగా ఆయనతో విభేదించి వేరుగా ఫ్యానెల్ ను స్థాపించి మెగాబ్రదర్ నాగబాబు సపోర్టు ఇవ్వడంతో గెలిచారు. ఇక అప్పటి నుంచి ఆయన తన ఇళ్లు, ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. తనకు త్వరగా నయం కావాలని కోరుకుంటుంది తెలుగు చిత్రపరిశ్రమ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles