One More Heroine to Romance Pushpa! వకీల్ సాబ్ బ్యూటీతో అల్లు అర్జున్ రోమాన్స్

Nivetha thomas to romance with allu arjun in pushpa

allu arjun to romance with nivetha thomas, nivetha thomas to romance with allu arjun, allu arjun nivetha thomas, allu arjun sukumar nivetha thomas, Allu Arjun, Nivetha Thomas, Pushpa, Sukumar, Pawan Kalyan, Pink, Vakeel Saab, Mythri movie makers, Tollywood, movies, Entertainment

Pushpa- this title, and of course, film as well, has been making headlines for various reasons. The Allu Arjun starrer and Sukumar directorial, Vijay Sethupathi and Rashmika Mandanna are officially part. As per the latest buzz, Nivetha Thomas is also part and ready to romance with bunny.

‘పుష్ప’లో బన్నితో రోమాన్ కు రెడీ అంటోన్న వకీల్ సాబ్ బ్యూటీ

Posted: 04/23/2020 06:11 PM IST
Nivetha thomas to romance with allu arjun in pushpa

టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అల వైకుంఠపురం చిత్రంతో అందుకున్న హిట్ తో జోరుమీదున్నాడు. తాజాగా బన్ని హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూపోందిస్తున్న చిత్రం ‘పుష్ప’. కాగా,  సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. లారీడ్రైవర్‌ లుక్ లో బన్నీ కనిపించనున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించనున్నారని ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ చిత్రంలో వకీల్ సాబ్ చిత్ర నటి కూడా బన్నితో రోమాన్స్ చేయనుందని వార్త చిత్రపురి వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అమె ఎవరు.? ఏమా కథ అంటారా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత రీ-ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ పింక్ చిత్రం రిమేక్ గా తెలుగులో వకీల్ సాబ్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా మెరువనున్న నివేదా థామస్‌ కూడా ఇక బన్నీతో కలసి సందడి చేయనుంది. బన్నీ ప్రియురాలి పాత్రలో నివేదా కనిపించనున్నారని.. అంతేకాకుండా నివేదా థామస్‌ పాత్రకు ‘పుష్ప’ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు రష్మిక.. అటవీ శాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. నివేదా కన్ఫామ్ అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదల చేసిన ‘పుష్ప’ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. హాలీవుడ్‌కు చెందిన మిరోస్లా కుబా బ్రోజెక్‌ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను కొంతకాలం పాటు నిలిపివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Nivetha Thomas  Pushpa  Sukumar  Pawan Kalyan  Pink  Vakeel Saab  Mythri movie makers  Tollywood  

Other Articles