Corona Crisis Charity feeding 12000 film employees చిరంజీవి సిసిసి చారిటీ నుంచి నిత్యావసరాలు రెడీ..

What s happening with ccc chiru releases video

chiranjeevi, prabhas, Balakrishna, Nani, sompurnesh babu, sai dharam tej, galla padmavati, sai kumar, adi sai kumar, Uv creation, corona crisis charity, Telugu film industry, industry daily labour, CCC Fund, movies, entertainment, tollywood

Megastar Chiranjeevi is personally overlooking Corona Crisis Charity (CCC) after several Tollywood actors came forward donating their part for the film employees and daily wage workers. Donating is not a big deal but identifying the needy and helping them in this crisis is sure a challenge. Chiranjeevi said that almost 12,000 industry employees have been identified and their families are helped.

చిరంజీవి సిసిసి చారిటీ నుంచి నిత్యావసరాలు రెడీ.. త్వరలో డెలివరీ

Posted: 04/09/2020 07:39 PM IST
What s happening with ccc chiru releases video

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో రోజువారీ వేతనానికి పనిచేసే ఎంతో మంది కార్మికులను అదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసెన్ ఛారిటీ స్థాపించిన విషయం తెలిసిందే. దినసరి వేతనాలపై ఆధారపడిన కుటుండాలను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చారు. చిరంజీవి స్వయంగా కోటి రూపాయలు అందజేశారు. అలాగే అక్కినేని నాగార్జున కోటి రూపాయలు ఇచ్చారు. ఇక మిగిలిన స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు సాయం అందించారు. మొత్తంగా ఏడు కోట్ల రూపాయలను విరాళంగా సేకరించారు.

ఈ డబ్బుతో 12000 కార్మిక కుటుంబాలకు నెలరోజులకు సరిపడా నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించారు. అయితే, కరోనా వైరస్ భయాందోళన నేపథ్యంలో ఎంతటి భద్రతల నడుమ ఈ వస్తువుల ప్యాకింగ్ జరుగుతుందో చూడావచ్చునని తాజాగా చిరంజీవి ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో వీక్షించవచ్చేనని చెప్పారు. అత్యంత ఉన్నత ప్రమానికలు పాటించి ప్యాకింగ్ చేస్తున్న దృష్యాలను ఈ వీడియోలో కనిపించాయి.

‘‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ పరిశ్రమలో రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులకు నిత్యావసరాలను సరఫరా చేస్తున్నాం. ఈ ప్రక్రియలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరం అనుకున్నవాళ్లకి డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇలాంటి మానవత్వంతో కూడిన మిషన్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంట్లో అవసరమైన పప్పులు, పిండిలను చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తున్న విధానాన్ని చిరంజీవి ట్వీట్ చేసిన వీడియోలో చూడొచ్చు. ఈ లాక్‌డౌన్ సమయంలో తమ కార్మికులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సినీ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles