Corona: Balayya donates 1.25 Crs కరోనాపై పోరుకు కదిలిన నందమూరి నటసింహం

Balakrishna donates rs 1 25 cr to the telugu states

Coronavirus, COVID-19, Nandamuri Balakrishna, NBK, Balayya, coronavirus, covid 19, AP CM's Relief Fund, Telangana CM's Relief Fund, CCC, Chiranjeevi, Chiranjeevi corona crisis, Telugu Film Industry, coronavirus screening, health advisory, self isolation, self quarantine, social distancing, hollywood, tollywood

Tollywood Hero Balayya has donated Rs 50 lakh each to Andhra Pradesh and Telangana Chief Minister's Relief Fund to help them fight the coronavirus. In addition, he has contributed a sum of Rs 25 lakh to Corona Crisis Charity (CCC), which was set up by Megastar Chiranjeevi.

కరోనాపై పోరుకు కదిలిన నందమూరి నటసింహం

Posted: 04/03/2020 12:03 PM IST
Balakrishna donates rs 1 25 cr to the telugu states

కరోనా వైరస్‌పై పోరాటానికి టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నేను సైతం అంటూ కదం తొక్కారు. తన వంతుగా తెలుగు రాష్ట్రాలకు ఆయన రూ. కోటి 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గత కొన్నిరోజుల నుంచి సినీ తారలు తమవంతు ఆర్థికసాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ రూ.1.25 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు సాయం ప్రకటించిన ఆయన.. అందులో రూ.50లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, మరో రూ.50 లక్షలు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ సహాయనిధికి అందించనున్నారు. తెలుగు సినీ కార్మికుల సహాయార్థం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీసీ(కరోనా క్రైసిస్‌ ఛారిటీ)కి రూ.25 లక్షలు ప్రకటించారు. ఈ మేరకు రూ.25లక్షల చెక్కును ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు సి.కల్యాణ్‌కు అందించారు. ఇక తెలంగాణలో మంత్రి కేటీఆర్ ను కలసి స్వయంగా రూ.50లక్షల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందులేని కరోనావైరస్ మహమ్మారిని జయించేందుకు ప్రజల వద్ద ఉన్న ఒకే ఆయుధం సామాజిక దూరం అని దానిని ప్రజలందరూ పాటించాలని అన్నారు. ఇక కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమై తగిన జాగ్రత్తలు పాటించి కరోనాను అరికట్టాలని బాలకృష్ణ సూచించారు. శుభ్రతను పాటించి పరిశ్రభ వాతావరణ మధ్య వుంటూ ఎంతటి కరోనా వైరసైనా దరి చేరదని ఆయన ప్రజలకు ధైర్యం చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles