Eros Now offers two months free subscription రెండు నెలల పాటు అందులోని సినిమాలన్నీ ఉచిత వీక్షణ

Eros now provides 2 months free subscriptions to indian users

Ali Hussein, COVID-19, Eros Now, OTT platform, corornavirus, work from home, Tollywood, quarantine, lockdown, Bollywood, Movies, Entertainment

SVoD platform Eros Now is offering a two-month free subscription offer for those who subscribe before 31st March. Eros Now CEO Ali Hussein noted that there has been an increase in the platform’s engagement during the current lockdown situation owing to COVID-19.

రెండు నెలల పాటు అందులోని సినిమాలన్నీ ఉచిత వీక్షణ

Posted: 03/23/2020 07:47 PM IST
Eros now provides 2 months free subscriptions to indian users

క‌రోనా వైర‌స్ మీద నెల‌కొన్న భ‌యాందోళ‌న‌ల కార‌ణంగా సినిమా స‌హా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీ మొత్తం కార్య‌క‌లాపాల్ని నిలిపి వేయ‌డంతో, ప్ర‌జ‌లు ఇళ్ల‌ల్లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారు. అనేక‌మంది సెల‌బ్రిటీలు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందకుండా, సోక‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి సూచ‌న‌లు చేస్తూ, ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురావ‌డానికి కృషి చేస్తున్నారు. పలువురు నటీనటులు క‌రోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. టీవీ, సెల్ ఫోన్లే ప్రస్తుతం వారికి ఎంటర్‌టైన్‌మెంట్.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 లాంటి వాటిలో సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈరోస్‌ నౌ దేశ ప్రజలందరికీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రాబోయే రెండు నెలలు  వినియోగదారులు తమ ప్లాట్‌ఫామ్‌లో నచ్చిన కంటెంట్‌ను ఉచితంగా వీక్షించొచ్చని తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోస్‌ నౌ ను ఉపయోగిస్తున్న వారిసంఖ్య గణనీయంగా పెరిగిందని సంస్థ సీఈవో అలీ హుస్సేన్‌ తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించడం, బయటి ప్రపంచంతో సంబంధంలేకుండా గడుపుతుండటంతో 2 నెలల పాటు ఉచితంగా ఈరోస్‌ నౌ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. 31 మార్చి 2020 లోగా సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నవాళ్లకే ఈ ఆఫర్‌ వర్తిస్తుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles