Tamannaah to romance with RaviTeja రవితేజతో మిల్కీబ్యూటీ తమన్నా రోమాన్స్

Milky beauty tamannaah to romance with mass maharaja raviteja

tamannaah, Raviteja, Mass Maharaja Ravi Teja, Raviteja tamannah, Raviteja tamannah bhatia, raviteja tamannah nakkina trinatha rao, Ravi Teja, Raviteja, mass maharaja, tamannah, tamannah bhatia, nakkina trinatha rao, Tollywood, Movies, Entertainment

Actress Tamannaah Bhatia, who will next be seen in Gopichand’s Seetimaar, is almost ready to romance with mass maharaja RaviTeja ib her next movie, directed by nakkina Trinatha rao.

మాస్ మహరాజాతో మిల్కీబ్యూటీ తమన్నా రోమాన్స్

Posted: 03/16/2020 09:40 PM IST
Milky beauty tamannaah to romance with mass maharaja raviteja

మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవల తన మనస్సులోని మాటలను చెబుతూ.. తాను సినిమాల్లో పెట్టుకున్న నో కిస్ కండీషన్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కోసమైతే పక్కనబెట్టేస్తానని చెప్పింది. అంతేకాదు తన స్వయంవరానికి కూడా హృతిక్ తో పాటు ప్రభాస్ కూడా హాజరుకావాలని కోరుకుంది. అయితే తాజాగా ఈ నటి మాస్ మహరాజ్తో రోమాన్స్ చేస్తోంది. అదేంటి ఇన్ని మాటలు చెప్పిన అమ్మడు ఇలా ప్లేటు ఫిరాయించిందేంటీ అనుకుంటున్నారా.? అంతేకదండీ టైమ్ మనం ఒకటి తలిస్తే.. కాలం మరోటి తలచిందని.. అంతలేదంటారా..

మ్యాటర్ లోకి ఎంట్రీఇస్తే.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా నటిస్తున్న మాస్ మహారాజా రవితేజ ఫుల్ బిజీగా వున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత 'రాక్షసుడు' దర్శకుడు రమేశ్ వర్మతో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టుతో నక్కిన త్రినాథరావు రెడీగా వున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న రవితేజతో మిల్కీ బ్యూటీ తమన్నా రోమాన్స్ చేయడమేంటీ అంటే..

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపోందనున్న సినిమాలో కథానాయికగా తమన్నాను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నాడట. దాదాపుగా కథానాయికగా ఆమెనే ఖరారు కావొచ్చని అంటున్నారు. 'బెంగాల్ టైగర్' తరువాత రవితేజతో తమన్నా జోడీ కడుతున్న చిత్రం ఇదే. ఈ సినిమాలో రవితేజ లుక్ డిఫరెంట్ గా ఉంటుందనీ, తమన్నా పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Raviteja  mass maharaja  tamannah  tamannah bhatia  nakkina trinatha rao  Tollywood  

Other Articles

  • I am glad that god has chosen me for this work sonu sood

    మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

    Jun 04 | ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూస్తూ.. తన వాళ్లను తలచుకుంటూ కుంగిపోతున్న వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన సెలబ్రిటీలు తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చేసిన సాయంతో పొందిన సంతోషాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఇంకా... Read more

  • Priyamani is comrade bharathakka in virata parvam

    విరాటపర్వంలో భారతక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత

    Jun 04 | రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్‌ భారతక్కగా కనిపించనున్నారు.... Read more

  • Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

    నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

    Jun 04 | నటుడు, దర్శకుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో కలసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరీ కె గణేశ్ స్పందించారు. తన చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలసి నటించడం లేదని ఆయన... Read more

  • Samantha strong reply to haters goes viral on social media

    విమర్శకులకు సుతిమెత్తగా.. నెట్టింట్లో సమంత జవాబు వైరల్..

    May 30 | సమంత అక్కినేని.. ఏం మాయ చేసిందో తెలియదు కానీ దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోని చాలా మంది అమ్మాయిలకు అమె ఓ రోల్ మోడల్. అంతేకాదు యువకులకు కూడా అమె... Read more

  • Jr ntr emotional tweet on senior ntr birth anniversary

    ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

    May 29 | తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. తన తాత వంశంలో జన్మించడం..... Read more

Today on Telugu Wishesh