Discovery''s Grylls shares Rajinikanth''s TV debut video అడవిలో సూపర్ స్టార్ రజనీ రియల్ అడ్వెంచర్

Bear grylls shares teaser for rajinikanth s into the wild episode says he embraced every challenge

Rajinikanth, Bear Grylls, Man vs. Wild, Discovery Channel, Running Wild with Bear Grylls, bear grylls with rajinikanth, man vs wild with rajinikanth, into the wild with bear grylls, rajinikanth discovery tamil, Bear Grylls, Rajinikanth, Into The Wild, Narendra Modi, Rajinikanth Episode

British adventurer Bear Grylls on Monday shared a new teaser for Discovery Channel’s show Into the Wild featuring actor Rajinikanth. He revealed that the 70-year-old veteran star embraced every challenge thrown at him in the wild.

అడవిలో సూపర్ స్టార్ రజనీ రియల్ అడ్వెంచర్

Posted: 03/09/2020 08:51 PM IST
Bear grylls shares teaser for rajinikanth s into the wild episode says he embraced every challenge

దక్షిణాధి సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న హీరో రజనీకాంత్. ఏడాదికో పర్యాయం ఆయన ధ్యానం కోసం హిమాలయాలకు వెళ్లడమే కాదు.. అవసరమైతే అడవులకు కూడా వెళ్తానని చేసి చూపిన స్టార్ రజని. ఏకంగా అడవిలోని వన్యమృగాలు కూడా దడిచే చిరుతలు, పెద్దపులులు సంచరించే అటవీ ప్రాంతంలోకి ఆయన తాజాగ వెళ్లి తన సాహస యాత్రను చేపట్టారు. డిస్కవరీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కోసం రజనీకాంత్ అడవులకు వెళ్లారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి రజనీ అటవీప్రాంతంలో తిరిగారు.

భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి చాలా పెద్ద హైప్ తీసుకువచ్చారు. స్వయంగా ప్రధాని కూడా బేర్ గిల్స్ తో కలసి అడవీలో సంచరించారు. ప్రధాని తరువాత ఆయన మార్గంలో అనేక మంది సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. ఇక తాజాగా తమిళ సూపర్ స్టార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ షూటింగ్‌ కోసం బేర్ గ్రిల్స్ కర్ణాటక వచ్చారు. కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో చిత్రీకరణ జరిగింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను డిస్కవరీ ఛానల్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈవీడియో నెటింట్లో హల్ చల్ చేస్తోంది.

ఇందులో రజనీ కొండలు ఎక్కుతూ, నీటిలో ఈదుతూ.. సాహసాలు చేస్తూ కనిపించారు. ‘ఇది నిజమైన సాహసం..’ అంటూ తన ఫీలింగ్‌ చెప్పారు. సూపర్ స్టార్‌ ఉత్సాహం చూసి బేర్‌ గ్రిల్స్‌ ప్రశంసించారు. తలైవాతో కలిసి పనిచేయడం గురించి ఆయన ట్వీట్‌ చేశారు. రజనీకాంత్‌ ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటారని, ఆయన ప్రతి ఛాలెంజ్ ను గొప్పగా స్వీకరించారని అన్నారు. దీంతో ఆయనపై గౌరవం మరింత పెరిగిందని చెప్పారు. మార్చి 23న రాత్రి 8 గంటలకు ఈ షో ప్రసారం కాబోతోంది. ‘మ్యాన్‌ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో బేర్ గ్రిల్స్ అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ... సాహసాలు చేస్తుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles