Nikhil Siddharth '18 Pages' movie launch Aravind అల్లువారి గారలపట్టి అర్హ క్యూట్ వీడియో..

Actor nikhil shares allu arha s cutest video with allu aravind

Allu Arha Cutest Video, Allu Arha, 18 Pages Movie Launch, 18 Pages Movie, Allu Aravind, Nikhil, Sukumar, Gopi Sundar, 18 pages movie, sukumar 18 pages movie, sukumar 18 pages, surya pratap palnati, gopi sundar, sukumar writings, Surya Pratap, ‘Kumari 21F’, Bunny Vas, GA2 banner, tollywood, movies, Entertainment

Tollywood hero Nikhil shared the cutest video of Allu Arjun's daughter Allu Arha with her grandfather Allu Aravind. Happy Days fame, hero Nikhil captured the lovely moments thought his mobile at his upcoming movie shooting location '18 Pages'. Hero Nikhil said that Allu Arha is the special guest for the ceremony.

'18 పేజెస్' అల్లువారి గారలపట్టి అర్హ క్యూట్ వీడియో..

Posted: 03/05/2020 07:01 PM IST
Actor nikhil shares allu arha s cutest video with allu aravind

ఒక వైపున చందూ మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' సినిమాను మొదలెట్టిన నిఖిల్, మరో వైపున సూర్యప్రతాప్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా మొదలుకానుంది. ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం. ఈ సినిమాకి '18 పేజెస్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన 'కుమారి 21F' విజయవంతం కావడంతో, ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాలో టైటిల్ లోను నెంబర్ ఉండేలా సూర్యప్రతాప్ చూసుకున్నాడని చెప్పుకుంటున్నారు.

విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమా, నిఖిల్ కి మరో హిట్ ఇవ్వడం ఖాయమనే ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ క్యూట్ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన కొత్త సినిమా '18 పేజీస్‌' షూటింగ్‌ ప్రారంభమైన సమయంలో చోటుచేసుకున్న ఈ వీడియోను స్వయంగా హీరో నిఖిల్ తన మోబైల్ ఫోన్ తో చిత్రీకరించారు. ఈ సినిమా కథను సుకుమార్‌ అందించారు.  

ఈ సందర్భంగా తన మనవరాలు (బన్నీ కూతురు) అర్హను కూడా అల్లు అరవింద్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'నువ్వు నన్నేం చేస్తావో చూడాలని ఉందట.. ఒక్క సారి చూపించు వాళ్లకి' అని అల్లు అరవింద్‌ ఆమెను అడగ్గా, తన తాత బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన నిఖిల్‌.. 'ఆమె మా చీఫ్‌ గెఫ్ట్.. స్పెషల్ గెస్ట్‌' అని వ్యాఖ్యానించాడు. ఈ సినిమా అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 ఆర్ట్స్‌ పతాకంపై బన్నీవాస్‌ నిర్మాతగా రూపుదిద్దుకుంటుంది.  చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. '18 పేజీస్‌' టైటిల్‌ పోస్టర్‌ను నిఖిల్‌ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.


 
 
 
View this post on Instagram

The Chief Guest for Our Movie Muhurtam... Allu Arha

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arha  18 Pages  Allu Aravind  Nikhil  Sukumar  Surya Pratap  Gopi Sundar  Bunny Vas  GA2 banner  tollywood  

Other Articles

Today on Telugu Wishesh