Jabardasth Comedians held in prostitution ఆ జబర్థస్త్ కమేడియన్లు నిజజీవితంలో విటులు..

Jabardasth comedians dorababu and paradesi held in visakha sex racket

Adi teammates, rising Raju, Dorababu, Jabardasth Comedians, Paradesi, Prostitution case, Vizag, Police, Andhra Pradesh, tollywood, Entertainment, Movies

Hyper Aadi and his Jabardasth team is back in the news headlines. This time not for the popular comedy show Jabardasth. According to the latest update, the two performers of the team have been arrested in a Prostitution case.

ఆ జబర్థస్త్ కమేడియన్లు నిజజీవితంలో విటులు..

Posted: 03/04/2020 06:52 PM IST
Jabardasth comedians dorababu and paradesi held in visakha sex racket

జబర్దస్త్ దొరబాబు ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ మంచి రసికుడ్నే అని నిరూపితం చేశాడు. పలు బీగ్రేడ్ సినిమాల్లో, బ్లూ ఫిల్మ్స్‌లో నటించిన దొరబాబు జబర్దస్త్‌లో కమెడియన్‌గా నవ్వులు పూయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతను విశాఖలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయాడు. ఒకమహిళతో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో తనను వదిలేయాలని పోలీసుల కాళ్లుపట్టుకుంటున్నాడు.

విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌ 201 ప్లాట్లో దాడులు నిర్వహించి ఓ మహిళతో పాటూ నలుగురు విటుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో జబర్దస్త్ కమెడియన్ దొరబాబు ఉండటంతో బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం దొరబాబుని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే దొరబాబుతో పాటు హైపర్ ఆది టీంలో చేస్తున్న పరదేశి కూడా ఉండటం విశేషం. అయితే వీళ్లు తమను అరెస్ట్ చేయవద్దని పోలీసుల కాళ్లు పట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది.

తూర్పుగోదావరి జిల్లా తొండంగికి చెందిన దొరబాబు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ మొదలుపెట్టిన దొరబాబు.. బీగ్రేడ్ చిత్రాలతో పాపులర్ అయ్యారు. ఆ తరువాత జబర్దస్త్ లోకి రావడంతో మనోడు క్రేజ్ పెరిగింది. హైపర్ ఆది స్కిట్‌లలో చాలా వరకూ దొరబాబు నిజజీవితంలో చేసిన పాత్రలపై పంచ్‌లు పేలుస్తుంటాడు. మనోడు మంచి రసికుడు అని.. యూట్యూబ్ లో దొరబాబు అని కొడితే మనోడి చరిత్ర మొత్తం వచ్చేస్తుందంటూ హైపర్ ఆది ప్రతి స్కిట్ లోనూ పంచ్‌లు వేస్తూనే ఉంటాడు. కాగా ఇలా రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోతాడని అసలు ఊహించివుండరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles