First Single From PSPK 26 To Be Out Soon ట్రెండ్ అవుతున్న పవన్ కల్యాణ్ హ్యాష్ ట్యాగ్

Ss thaman croons the first single for pawan kalyan

Wakeel Saab, PSPK26, first single update, pawan kalyan, ss thaman music director for PSPK26, pink remake first single update, pawan kalyan pspk26 first single update, ss thaman pspk26 song update, pawan kalyan pink movie update, pspk26 songs, pink movie remake in telugu, power star pawan kalayan, movies, Entertainment, tollywood

Power Star Pawan Kalyan is all set to make his comeback in films. Ever since the announcement of PSPK 26, fans can't control their excitement. The new development of the film has come out now. The first single of PSPK 26 is ready and it's been composed by ace music director SS Thaman.

ట్రెండ్ అవుతున్న పవన్ కల్యాణ్ హ్యాష్ ట్యాగ్ #PSPK26FirstSingle

Posted: 02/27/2020 10:33 PM IST
Ss thaman croons the first single for pawan kalyan

పవర్‌స్టార్‌ అభిమానులకు త్వరలో సర్‌ప్రైజ్‌ రానుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘పింక్‌’ సినిమా రీమేక్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ త్వరలో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ ట్విటర్లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఆయనకు అతిపెద్ద అభిమానినైన నేను కూడా #PSPK26FirstSingle విడుదల కోసం ఎదురు చూడలేకపోతున్నాను. #PSPK26 కోసం మా బృందం మొత్తం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. ఇది మాకే కాదు అందరికీ ఎంత ముఖ్యమో బాగా తెలుసు.

పవన్ కల్యాణ్‌ చిత్రానికి ఉత్తమ సంగీతాన్ని అందించేందుకు మేము కృషి చేస్తున్నాం. లవ్‌ యూ ఆల్‌. #firstsingle #PSPK26FirstSingle త్వరలో రానుంది’ అని తమన్‌ ట్వీట్‌ చేశారు. ట్వీట్స్‌తోపాటు ఆయన పవన్‌ ఫొటోతో ట్విటర్‌ ప్రొఫైల్‌ పిక్‌ను కూడా మార్చేశారు. తమన్‌ ట్వీట్‌ చూసిన పవన్‌ అభిమానులు #PSPK26FirstSingle హ్యాష్‌ట్యాగ్‌తో పలు ట్వీట్లు చేస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో #PSPK26FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ఇండియా ట్రెండింగ్‌తో దూసుకెళ్తోంది.

పవన్‌ కల్యాన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ‘వకీల్ సాబ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్‌’ సినిమా రీమేక్‌గా పవన్‌ సినిమా తెరకెక్కుతోంది. దిల్‌రాజు ఈ చిత్ర నిర్మాత. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దిల్‌రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wakeel Saab  PSPK26  first single update  pawan kalyan  power star  tollywood  

Other Articles