Director Harish Shanker Thanks Hyderbad Police అర్థరాత్రి భారీశబ్దాలు.. పోలీసులకు డైరెక్టర్ ధన్యవాదాలు

Tollywood director harish shanker thanks hyderbad police

Tollywood Director, Harish Shanker, Hyderbad Police, tweet, twitter, construction work, Jubilee Enclave colony, Jubiliee Hills, Tollywood

Tollywood Director Harish Shanker Thanks Hyderbad Police for responding to his tweet and rushed to the spot to stop construction work going-on in the odd time disturbing the localites in the Jubilee Enclave colony.

అర్థరాత్రి భారీశబ్దాలు.. పోలీసులకు డైరెక్టర్ ధన్యవాదాలు

Posted: 02/17/2020 03:47 PM IST
Tollywood director harish shanker thanks hyderbad police

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ట్విటర్‌ వేదికగా హైదరాబాద్‌ సిటీ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తాను నివాసం ఉంటున్న జూబ్లీ ఎన్‌క్లేవ్స్‌ రెసిడెన్సీ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలో భారీ శబ్ధాలతో భవన నిర్మాణాలు చేపడుతున్నారని, దానివల్ల ఇబ్బందిగా ఉందని ఆయన ఆదివారం రాత్రి ఓ ట్వీట్‌ పెట్టారు. దీంతో పాటు అర్థరాత్రి పూట జనవాసాల ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడానికి జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ సిటీపోలీస్‌.. అనుమతినిచ్చారా..! అని కూడా ఆయన ప్రశ్నించారు.

భారీ శబ్దాలతో అర్థరాత్రిపూట కొనసాగుతున్న నిర్మాణాలపై తాను న్యాయపరంగా ఫిర్యాదు చేయడానికి సన్నధమవుతున్నానని, అంతకంటే ముందు తనకు సంబంధిత అధికారల నుంచి సమాధానం తెలుసుకోవాలని భావిస్తున్నానని అన్నారు. ఒకవేళ అధికారుల అనుమతులు వుంటే వారి అదేశాలను తాను పాటించి పిర్యాదు చేయకుండా నిమ్మకుండిపోతానని హరీశ్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ పై హైదరాబాద్ పోలీసులు వెంటనే స్పందించారు.

హరీశ్ శంకర్‌ అడ్రస్ ను అడిగి తెలుసుకున్న పోలీసులు పెట్రోలింగ్‌ సిబ్బందిని పంపించి.. భవన నిర్మాణ పనులను నిలిపివేయించారు. దీంతో హరీశ్‌ ట్విటర్‌ వేదికగా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ‘నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాలు ఆగిపోయాయి. జూబ్లీ ఎన్‌క్లేవ్‌ రెసీడెన్సీలో నివాసముంటున్న వారందరి తరఫున ధన్యవాదాలు. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరని.. ఎప్పుడైనా రాగలరని నిరూపించారు. నా వినతిని మన్నించి.. వెంటనే స్పందించి.. మా నమ్మకాన్ని నిలబెట్టి మేము మరింత బాధ్యతగా మెలిగేలా చేసినందుకు కృతజ్ఞతలు’ అని హరీశ్‌ శంకర్‌ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles