Nithin To Marry Shalini On April 16? ముహూర్తం ఫిక్స్ చేసుకున్న నితిన్.. వేదిక కూడా..

April turns month of nithiin love marriage

hero nithin, marriage, Shalini Reddy, nithin marriage, nithin wedding, United Kingdom, Dubai, April 16th, Bheeshma, Rashmika Mandanna, Hebah Patel, Venky Kudumula, Naga Vamsi, Sithara Entertainments, Andhadhun’ Telugu remake, tollywood, movies, Entertainment

According to the latest buzz in the film industry, the young actor Nithiin is all set to tie the knot in the month of April next year. He is one of the most eligible bachelors of Tollywood. So, his wedding news will surely grab the interest of his fans.

ముహూర్తం ఫిక్స్ చేసుకున్న నితిన్.. వేదిక కూడా..

Posted: 02/01/2020 11:31 AM IST
April turns month of nithiin love marriage

తేజ దర్శకత్వంలోని జయం చిత్రంతో సినీమారంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నితిన్.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా వున్నాడు. అయితే ఈ యంగ్ హీరో కూడా త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడన్న టాక్ ప్రస్తుతం సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. చిత్రసీమలోకి నితిన్ ఎంట్రీ ఇచ్చి అప్పుడే 17ఏళ్లైనా.. ఆయన ద్యాస సినిమాలపైనే వుంది తప్ప పెళ్లి వైపు మళ్లింది లేదు. కాగా, తాజగా ఆయన కూడా ఓ అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడని, అమెతోనే త్వరలో ఓ ఇంటి వాడు అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఆయన తల్లిదండ్రులు కూడా నితిన్‌కు పెళ్లికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దీంతో నితిన్ పెళ్లి కూడా ఫిక్స్‌ అయినట్లు.. ఏప్రిల్‌ 16న శాలిని అనే అమ్మాయితో నితిన్‌ ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15వ తేదీన నితిన్ నిశ్చితార్ధం జరగబోతుందట హైదరాబాద్‌లో. యూకేలో ఎంబీఏ చేసిన శాలినిని నితిన్‌ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడట. వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించారట. ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించినట్లు చెబుతున్నారు.

పెళ్లి పనులన్నీ నితిన్ సోదరి నిఖిత దగ్గరుండి చూసుకుంటుందట. ఈ మ్యారేజ్ డెస్టినేషన్ మ్యారేజ్‌గా కుటుంబ సభ్యులు చేయనున్నట్లు సమాచారం. దుబాయ్ లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్ లో వైభవంగా వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్‌లో సన్నిహితులకు గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఇవ్వనున్నాడట. ప్రస్తుతం వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero nithin  marriage  Shalini Reddy  nikhita reddy  United Kingdom  Dubai  April 16th  Bheeshma  tollywood  

Other Articles