మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కోరాజా మూవీ ఫస్ట్ వీకెండ్ డీసెంట్‌గా ముగించింది. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాబట్టనప్పటికీ.. ఫర్వాలేదనిపించింది. రామ్ తుళ్లూరి నిర్మాతగా ఎస్ఆర్టీ బ్యానర్ పై నిర్మించిన డిస్కోరాజా సేఫ్ జోన్ లోకి రావాలంటే మాత్రం ఇంకొన్ని రోజులపాటు డీసెంట్ రన్ కొనసాగించక తప్పదు.
పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రవితేజ నటన బాగుందని టాక్ వచ్చినా.. టాక్ మేరకు కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం వుందంటున్నారు ట్రేడ్ పండితులు. తొలి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మూడు రోజుల పాటు అన్ని ఏరియాల్లోనూ డీసెంట్‌గా ప్రదర్శించబడింది. ఈ మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.88 కోట్లు రాబట్టాడు రవితేజ. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 6.86 కోట్లు వసూలు చేశాడు ఈ డిస్కో రాజా.
తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 4.1 రూపాయల వసూళ్లను రాబట్టింది. రెండో రోజున అది రూ.3.7 కోట్లు, మూడో రోజున రూ.3.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక నాలుగో రోజున రూ.2 కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. దీంతో మొత్తంగా రూ. 13.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.10 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 19.20 కోట్లు ప్రి-రిలీజ్ బిజినెస్ సాగించిన ఈ చిత్రం.. ఈ క్రమంలో బ్రేక్ ఈవెన్ పాయింట్ కు చేరుకోవాలంటే.. మరో వారం రోజుల పాటు మరో పది కోట్ల రూపాయల బిజినెస్ చేస్తే చిత్రం లాభాల్లోకి చేరకుంటుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more