Comedian Sunil admitted to Hospital for sinusitis నటుడు సునీల్ కు అస్వస్థత…. అభిమానుల్లో ఆందోళన

Tollywood comedian sunil admitted to hospital for sinusitis

actor sunil, Comedian sunil, sunil ill, Sunil Hospitalised, Sunil asian institute of Gastroentrology, GachiBowli, Sunil fans in Tension, cinema news, latest movie news, movie news, tollywood, trending movie updates

Another worry to fans of Tollywood. After star director Boyapati mother's demise and Stylish star allu arjun's maternal uncle MR Prasad passed away in this week another news worry fan. Tollywood Star Comedian Sunil admitted to Asian Institute of Gastroentrology Hospital for treatment of sinusitis

నటుడు సునీల్ కు అస్వస్థత…. అభిమానుల్లో ఆందోళన

Posted: 01/23/2020 01:42 PM IST
Tollywood comedian sunil admitted to hospital for sinusitis

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. హీరో తరుణ్, రిచాల కలయికలో సూపర్ హిట్ కొట్టిన 'నువ్వే కావాలి' సినిమాతో టాలీవుడ్ కి కమెడియన్ గా పరిచయం అయిన హాస్య నటుడు సునీల్, ఆ తరువాత చిరునవ్వుతో, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, నువ్వే నువ్వే తదితర హిట్ సినిమాల్లో తన హాస్యపు జల్లులతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించాడు.

అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్, ఆపై దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత  హీరోగా సునీల్ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ తన కామేడియన్ ట్రాక్ కు ఫిక్స్ అయ్యాడు. దర్శకుడు త్రివిక్రమ్ కు మంచి మిత్రుడైన సునీల్, ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇకపోతే నిన్నటి నుండి ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందులు పడుతున్న సునీల్, ఇవాళ హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో గల ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు.

ఉదర సంబంధిత వ్యాధికి చికిత్స కోసం సునీల్ ఆ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక సునీల్ అస్వస్థతకు గురైన విషయం కాసేపటి క్రితం పలు మీడియా మాధ్యమాల ద్వారా బయటకు రావడంతో పలువురు సినిమా ప్రముఖులు సహా ఆయన ఫ్యాన్స్ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. దీంతో  స్పందించిన సునీల్‌... తాను ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. సైనస్‌, ఇన్ఫెక్షన్‌ కారణంగా వైద్యుల సూచనతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. సునీల్‌ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానుంది. అతి త్వరలో తెరకెక్కనున్న ‘కలర్ ఫోటో’ సినిమా ద్వారా ప్రతినాయకుడిగా నటించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles