Man tries to kiss Sara Ali Khan's hand యువరాణికి ముద్దు పెట్టే యత్నం.. షాకైన నటి

Man tries to kiss sara ali khan s hand actress left shocked

sara ali khan, sara ali khan new, sara ali khan latest, sara ali khan behaviour with fans, sara ali khan dance, sara ali khan latest news, sara ali khan fan misbehaves, sara ali khan fan kiss, sara ali khan controversial video, sara ali khan controversy, bollywood stars controversy, fans misbehave with actress, fans misbehave with sara ali khan, sara ali khan iifa performance, sara ali khan weight loss, Bollywood News, Bollywood Celebs, Gossips

Sara Ali Khan gets uncomfortable as a fan comes closer and tries to kiss her hand. The 'Simmba' actress was recently snapped outside her gym. During her daily ritual of greeting fans in a polite way, a man asks for Sara's hand and tried to kiss her hand.

యువరాణికి ముద్దు పెట్టే యత్నం.. షాకైన నటి

Posted: 01/10/2020 06:31 PM IST
Man tries to kiss sara ali khan s hand actress left shocked

అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే ఎంతోమంది ఫ్యాన్స్ ఫాలో అయ్యేలా చేసింది. సారా అందానికి ఫిదా అయిన నెటిజన్లు ఆమెను ప్రేమగా ‘యువరాణి’ అని పిలుస్తుంటారు. ఆమె కూడా ఆ మాటను నిలుపుకునేలా తనను పలకిరించి ఫ్యాన్స్ ను అమె అంతా ఆప్యాయతతో స్పందిస్తారు.

తాజాగా ఈ చిన్నది జిమ్‌ నుంచి బయటకు వస్తుండగా చూసిన అభిమానులు, ఆమెను పలుకరించారు. అమెను ఫొటోలకు పోజులివ్వమని కోరారు. దీంతో సారా వారిని అప్యాయంగా పలకరించడంతో పాటు సెల్పీలు కావాలన్న ఫ్యాన్స్ ను కూడా పిలిచింది. వారితో కలసి సెల్పీలు దిగింది. అయితే ఓ అభిమాని అమెను కరాచలనం చేయాలని అడిగ్గా.. సారా వెంటనే చేయి అందించారు. అయితే అభిమాని అకతాయితనంతో షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత చేతిపై ముద్దుపెట్టుకోబోయాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.

అక్కడే ఉన్న సారా బాడీగార్డ్స్‌ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సారా అక్కడి వారు షేక్ హ్యాండ్ అడగ్గా, నమస్కారం పెట్టారు. పలువురితో సెల్పీలు దిగిన తరువాత అమె అక్కడి నుంచి నిష్క్రమించారు. అయితే ఇలాంటి అనుభవం అమెకు ఇదివరకు కూడా ఎయిర్ పోర్టులో ఎదురైంది. అమెతో సెల్పీ దిగే క్రమంలో ఓ అభిమాను అమెను అత్యంత సమీపానికి రాగా, వెంటనే తేరుకున్న అమె అతడి నుంచి దూరంగా జరిగారు. అయితే తాజా ఘటన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

దీంతో ఈ వీడియోను చూసిన అభిమానులు అమెను కొనియాడుతూనే అభిమాని చేసిన అకతాయి పనికి మాత్రం తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇక మరికొందరు మాత్రం అమెపై అప్యాయత కొద్దీ ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. మీకు ఒక బాడీ గార్డ్ అవసరం అంటున్నారు. ఇక వారి ప్రేమ కామెంట్ల రూపంలో వెల్లివిరిసింది. ‘సారా మీ అందానికి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. కాబట్టి మీరు వెంటనే సెక్యూరిటీని పెంచుకోండి’, ‘సారా చాలా వినయంగా ప్రవర్తించి అతనికి చేయి అందిస్తే.. అతను మాత్రం ఇలా ప్రవర్తించడం ఏం బాలేదు.’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sara Ali Khan  Fan misbehave  Kiss  shakehand  Shock  Bodyguard  Celebrity  Bollywood  

Other Articles