స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో . ఈ సినిమా మ్యూజికల్ కన్సర్ట్ హైదరబాద్ లో గొప్పగా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా వుంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.
ఇప్పుడు అల్లు అర్జున్ యూసఫ్ గూడా లోని గ్రౌండ్స్ లో మ్యూజికల్ నైట్ ని ప్లాన్ చేసి తమన్ తో రఫ్ ఆడిస్తున్నాడు. ఇప్పటికే ఈ వేడుకకు హాజరైన అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ హీరోయిన్లు అందరూ రావడంతో సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ ఇద్దరూ కలిసి సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ గ్రౌండ్ లో వచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరిపోయింది. త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, డైలాగ్ లు స్పష్టంగా ట్రైలర్ లో ప్రస్పూటిస్తున్నాయి.
అంతేకాకుండా సినిమాలో బన్నీ డాన్స్ మరియు ఫైట్లు అదరగొట్టే రీతిలో చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా అది కూడా కొంపలు మునుగుతున్నా నిజం తప్ప అబద్దం చెప్పని వ్యక్తిగా నటిస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఇక పూజా హెగ్డేకి చెందిన ఆఫీస్ లో బన్నీ నటిస్తున్నట్టు, పూజా తల్లిగా టబు తండ్రిగా తమిళ నటుడు జయరాం నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చింది. అయితే బన్నీని సపోర్ట్ చేస్తున్నట్టున్న పాత్రను పోషించిన సచిన్ ఖేడ్కర్ పాత్ర ఏమిటి అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more