Iddari Lokam Okate gears up for release ‘‘ఇద్దరి లోకం ఒకటే’’ ఫీల్ గుడ్ ట్రైలర్

Iddari lokam okate gets u a gears up for release

Raj Tarun, Shalini Pandey, Arjun reddy, dil raju, Sirish, iddari lokam okate, love entertainer, movie, producer, sirish, sri venkateswara creations, Christmas, Tollywood, movies, Entertainment

The theatrical trailer of young hero Raj Tarun's 'Iddari Lokam Okate' is out now and throbbing the hearts of movie buffs. The movie is produced by Sri Venkateswara Creations and Arjun Reddy's actress Shalini Pandey is playing the female lead.

‘‘ఇద్దరి లోకం ఒకటే’’ ఫీల్ గుడ్ ట్రైలర్

Posted: 12/17/2019 10:03 PM IST
Iddari lokam okate gets u a gears up for release

స్టార్ ప్రోడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో రూపోందుతున్న చిత్రం `ఇద్దరి లోకం ఒకటే` క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 25న విడుదలకు అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా ట్రైయిలర్ ను విడుదల చేసింది. యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్ హీరోగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ముమ్మాటికీ యువతను అకర్షించే ప్రేమకథా చిత్రంగా నిలువనుంది. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే రాజ్ తరుణ్ సరసన నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై శిరీష్‌ నిర్మాతగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇది ప్రేమ కథా చిత్రంగా రూపోందింది. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. అబ్బూరి ర‌వి మాట‌లు రాశారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచారంలో భాగంగా మంగళవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇది ఫీల్ గుడ్ మూవీ అని అర్థమవుతోంది.

ట్రైలర్ చాలా ప్లెజెంట్ గా, అందంగా ఉంది. రాజ్ తరుణ్ కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా ఎనర్జిటిక్ గా కనిపించిన రాజ్ తరుణ్.. ఈ సినిమాలో క్లాసికల్ సినిమాల హీరోలా కనిపిస్తున్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు మణిరత్నం సీన్స్ ను గుర్తుచేస్తున్నాయి. చిన్నతనంలో ఫ్రెండ్స్ అయిన అమ్మాయి, అబ్బాయి పెద్దయ్యాక మళ్లీ కలుసుకోవడం, వాళ్ల మధ్య ప్రేమ పుట్టడం ప్రధాన కథాంశంగా తెలుస్తోంది. అయితే, ట్రైలర్లో డైలాగ్ వింటుంటే ఏదో ట్విస్ట్ ఉందని అర్థమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh