You Are My High song from Prati Roju Pandage “ప్రతిరోజూ పండగే” నుంచి శ్రావమైన యువళ గీతం..

You are my high lyrical video song from prati roju pandage

Prati Roju Pandage, Trailer, sai dharam tej, Raashi Khanna, SatyaRaj, Rao Ramesh, Thaman, Maruthi, Bunny Vas, Tollywood, movies, entertainment

Director Maruthi is back with a new outing Prati Roju Pandage. Now the film Unit has released the second song from the film You are my HIgh, which is a youthful Romantic song.

“ప్రతిరోజూ పండగే” నుంచి శ్రావమైన యువళ గీతం..

Posted: 12/17/2019 08:35 PM IST
You are my high lyrical video song from prati roju pandage

మారుతి దర్శకుడిగా సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం “ప్రతిరోజూ పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. గత కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ధరమ్ తేజ్ కి రమారమి ఫ్యామిటీ ఎంటైర్ టైనర్ తో హిట్ అందుకునేలా చిత్రాన్ని రూపోందించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా కుటుంబ కథా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ను విడుదల చేశారు. "కనుబొమ్మే నువ్వు కనబడితే సరి కలలెగరేసెనుగా .. కనుకేమో తలకిందులుగా పడి మది మది తిరిగెనుగా .. హైరానా పడిపోయా .. హాయిని వదిలిన ఎద వలన .. ఇంకొంచెం అడిగేశా తీయని హాయిని వద్దనక .. యూ ఆర్ మై హై" అంటూ ఈ పాట సాగుతోంది. యూత్ కి నచ్చేలా ఈ పాటను చిత్రీకరించారు. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో సింగర్‌గా కూడా మారారు.

రాశీతో సంగీత దర్శకుడు తమన్ మంచి డాన్స్ నంబర్ ను పాడించారు. ‘‘కనుబొమ్మే నువు కనబడితే సరి కలలెగరేసునుగా’’ అంటూ సాగే ఈ వెస్ట్రన్ టైప్ సాంగ్ ను రాశీ అద్భుతంగా పాడారు. దీపుతో కలిసి రాశీ పాడిన ఈ పాటకు రాహుల్ నంబియార్ వోకల్స్ పాడారు. శ్రీజో సాహిత్యం అందించారు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆయన పాత్ర హైలైట్ కానుందని అంటున్నారు. ధరమ్ తేజ్ సరసన గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prati Roju Pandage  Trailer  sai dharam tej  Raashi Khanna  Thaman  Maruthi  Bunny Vas  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh