Shiva Kandukuri to debut with 'Chusi Chudangane' ఆకట్టుకుంటున్న చూసిచూడంగానే ట్రైలర్

Shiva kandukuri to debut with chusi chudangane

choosi choodagane, chusi chudangane, shiva kandukuri, varsha, sheshusindhu, Raj kandukuri, Tharun bhascker, Suresh Babu, Suresh Productions tollywood, movies, Entertainment

Actor, Director Tharun bhascker and prominent producer Suresh Babu Launched the Thratrical Trailer of movie choosi choodagane

ఆకట్టుకుంటున్న చూసిచూడంగానే ట్రైలర్

Posted: 12/04/2019 07:48 PM IST
Shiva kandukuri to debut with chusi chudangane

తెలుగు తెరకు మరో కొత్త హీరో పరిచయం కానున్నాడు. టాలెంట్ వుంటే మాత్రం సరిపోదు.. దానిని ఆన్ స్ర్కీన్ పై అవిష్కరిస్తే చాలు.. అక్కున చేర్చుకుంటామనే తెలుగు ప్రేక్షకుడు వున్నంత కాలం కొత్తహీరోలకు కొదవలేదు. అయితే కాసింత సినీవారసత్వంతో వచ్చిన శివ కందుకూరి.. త్వరలో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత.. ప్రముఖంగా పెళ్లి చూపులు చిత్రాన్ని నిర్మించిన రాజ్ కందుకూరి ఈ చిత్రంతో తన తనయుడిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు.

రోమాంటిక్ ప్రేమకథకు వ్యక్తిగత విజయాలను జోడించి.. తన జీవితాన్ని వెతుక్కునే వ్యక్తిగా ఇందులో శివ కందుకూరి కనిపించనున్నాడు. చిత్రానికి చూసీ చూడంగానే అనే టైటిల్ ను ఖారురు చేసిన యూనిట్ ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేయనుంది. ఇక ఈ చిత్రంతో తెలుగు చిత్ర రంగానికి మరో మహిళా దర్శకురాలు పరిచయం కానున్నారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన అనుభవంతో శేష సింధు ఈ సినిమా దర్శకత్వం బాధ్యతలను తీసుకున్నారు. కాగా, ఈ సినిమాను రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ప్రేమ .. ప్రేమికుల మధ్య అలకలు .. గొడవలు .. కుటుంబ సభ్యుల మధ్య ఎమోషన్స్ తో ఈ ట్రైలర్ సాగింది. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఒక్కరోజులోనే పది లక్షల వ్యూస్ దాటి వెళ్లింది. ఈ చిత్రంలో శివ సరసన వర్ష - మాళవిక కథానాయికలుగా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chusi chudangane  shiva kandukuri  varsha  sheshusindhu  Raj kandukuri  tollywood  

Other Articles