‘సూపర్‌స్టార్’ మహేష్ బాబు గారాల పట్టి సితార తండ్రి తరహాలోనే చిన్ననాటి నుంచే తనలోని నటవారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తోంది. బాలనటుడిగా చిన్నప్పుడే వెండితెరపై మెరుపులు మెరిపించిన సూపర్ స్టార్ మాదిరగానే.. ఆయన తనయ సితార కూడా తన మధురస్వరాన్ని వినపించి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిన విషయం తెలిసిందే. ఏడేళ్ల ప్రాయంలోనే హాలీవుడ్ మూవీకి డబ్బింగ్ చెప్పేసింది.
ప్రపంచ ప్రఖ్యాత నిర్మాత సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మించిన ఫ్రోజెన్ 2 చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు తెలుగులో సితార డబ్బింగ్ చెప్పింది. ఫ్రోజెన్ 2 మూవీ ఈనెల 22న విడుదల కానుంది. దీనితో తమ సూపర్ స్టార్ మహేష్ కుమార్తె చిట్టి సితార వాయిస్ తెరపై విని ఆనందించాలని మహేష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చేస్తున్నారు. అభిమానులే కాదు.. ఏకంగా మహేష్ బాబు కూడా ఈ నెల 22 ఎప్పుడోస్తుందా.? అని వేయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ఈ మేరకు తన చిన్నారి సితార కోసం మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తన కూమార్తెను చూస్తే గర్వంగా వుందని అన్నారు. తన కుమార్తె గొంతును తొలిసారిగా వెండితెరపై వినేందుకు ఆగలేకుండా ఉన్నానని మహేశ్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. "ఆమె నిజంగా క్వీన్ ఎల్సాకు మినీ వర్షన్. ఎంతో నమ్మకంగా, మ్యాజికల్ గా, స్వచ్ఛంగా ఉంది. సీతూ పాపను చూస్తుంటే గర్వంగా ఉంది. నవంబర్ 22 వరకూ ఆగలేను" అని ట్వీట్ చేశారు.
She is truly a mini version of Queen Elsa! Confident, Magical and Pure. So proud of you Situ papa! Can't wait for 22nd November #Frozen2 in Telugu...@DisneyStudiosIN pic.twitter.com/aN6uu4s0EG
— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2019
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more