Shruti dubbed for Elsa's character ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పి ఎంతో మురిసిపోయినా - శృతి

Shruti dubbed for elsa s character

Shruti Haasan, Frozen 2, Elsa character, Hollywood Movies, Entertainment News

Actress Shruti Haasan has given his voice for the Elsa character in the Tamil dubbed version of Hollywood Movie Frozen 2.

ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెప్పి ఎంతో మురిసిపోయినా - శృతి

Posted: 11/15/2019 04:57 PM IST
Shruti dubbed for elsa s character

2013 లో విడుదల అయినా “ ఫ్రోజెన్ “ చిత్రం మగువల మనస్సులను ఒక్కసారిగా కొల్లగొట్టింది. వాల్డ్ డెస్టినీ విడుదల చేసిన ఈ సినిమా లోని ఫాంటసీ మగువల ఆలోచనలను కట్టిపడేసింది. అంతేకాక ఎంతో ఆకట్టుకుంది. అసలు అమ్మాయిలు కలల ప్రపంచంలో ఒక దిశలో తిరుగాడుతుంటారు. రేయి - పగలు అని తేడా లేకుండా ఆ విహార లోక దిశలో దిశను మరచి విహరిస్తారు. అందు ఈ సాహస కన్యలా చిత్రం ఒక ఊరట వాళ్లకి. ఈ చిత్రం లో ప్రధానంగా ఇద్దరు అక్కాచెలెళ్లు ఉంటారు. వారు సాహసోపేత పనులు చేస్తుంటారు. ఇది చాలదా అమ్మాయిలా మదిని దోచడానికి. ఇలా ఆ సినిమా మాయలో అక్షరాలా ఏడూ సంవత్సరాలు గడిపేశారు. ఈ సంవత్సరంలో “ ఫ్రోజెన్ - 2 “ ఈ నెల 22న విదుదల కానున్నది. 

ఇదిలా ఉంటె ఈ చిత్రంలోని ఒక పాత్రకు కమలహాసన్ తనయ, అందాల భామ శృతి హాసన్ “ఎల్సా“ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. “ఎల్సా, అన్నా“ ఇరువురు అక్క చెలెళ్ళు. ఎల్సా పాత్రకు శృతి డబ్బింగ్ చెప్పి ఎంతో మురిసిపోయారు ఆ చిత్ర విడుదలకి చాలా ఆతురతతో ఎదురుచుస్తునా సందడి చేస్తున్నారు.

ఈ చిత్రం కథ విషయానికి వస్తే అక్క చెలెళ్ల మధ్య ఉండే ప్రేమానుబంధాలా గురించి ,వారి ఆత్మీయత - అనురాగాల గురించి ఉంటుంది. ఈ సందర్భంగా శృతి హాసన్ తన గారాల చెల్లీ అక్షరను తలచుకున్నారు. ప్రతి అక్కకి తన చెలెల్లి పై ఎన్నలేని ప్రేమ దాగి ఉంటుంది. అక్షర అంటే తనకు చాల ఇష్టం అని జీవితంలో సోదరి - సోదరుణుల బంధం చాలా అమూల్యమైనది అని తెలిపారు. అక్షర లాంటి సోదరి లభించడం తన అదృష్టం అని శృతి భావించారు.

అంతేకాక ఈ చిత్రానికి హిందీ లో ప్రియాంక చోప్రా డబ్బింగ్ చెప్పగా. తెలుగు లో నిత్య మీనన్ మరియు ఎల్సా చిన్ననాటి వయస్సుకు మహేష్ బాబు ముద్దుల కూతురు సితార డబ్బింగ్ చెప్పారు.

ఏది ఏమైనా ఈ ఫాంటసీ లోక అంచులకు మనమందరం ఓసారి వెళ్ళివద్దాము.. “ఎల్సా, అన్న“ యొక్క సోదరి - సోదరి మణులను ఓమారు పలకరించి వద్దాము.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Frozen 2  Tollywood  

Other Articles