మొదటి వివాహవార్షికోత్సవాన్ని తిరుమలలో జరుపుకున్న దీపికా - రణవీర్ దంపతులు..

Deepika ranveer celebrating first wedding anniversary

Deepika Padukone, Ranveer Singh, Tirumala, Lord Venkateswara Swamy, Deepika Ranveer wedding anniversary, Bollywood, Deepika Ranveer Marriage

Today Deepika Padukone and Ranveer Singh were celebrating their first wedding anniversary and the couple offer prayers at Lord Venkateswara Swamy temple, Tirumala

మొదటి వివాహవార్షికోత్సవాన్ని తిరుమలలో జరుపుకున్న దీపికా - రణవీర్ దంపతులు..

Posted: 11/14/2019 04:14 PM IST
Deepika ranveer celebrating first wedding anniversary

తిరుమల తిరుపతి ఏల్లప్పుడు భక్తుల తాకిడితో కళకళలాడుతుంది .. దేశ విదేశాల నుండి ప్రతి రోజు వేలా ది భక్త జనం కదలి వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు.. భారత దేశంలోనే అత్యంత రద్దీ అయినా పుణ్య క్షేత్రం అంటే కళ్ళుమూసుకుని చెప్పే ప్రదేశం మన తిరుపతి ..

నేడు శ్రీవారిని పలువురు ముఖ్య అతిధులు దర్శించుకున్నారు.. ఉదయం తెల్లవారు జామున VIP ప్రారంభ దర్శన సమయంలో బాలీవుడ్ అందాల జంట రణవీర్ సింగ్ మరియు అతని ధర్మ పత్ని దీపికా పదుకొనె శ్రీవారి సేవలో పాల్గొన్నారు.. గడిచిన ఏడాది నవంబర్ 14 నా అంగరంగ వైభవంగా ఇటలీలోని లేక్ కొమోలో పరిణయ బంధానికి నాంది పలికారు.. ఈరోజు వారి మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని శ్రీవారి ఆశీస్సులకై ఇటు తరలి వచ్చారు.. ఆలయంలో మంచి సదుపాయాలతో పాటు అధికారుల నుండి మంచి స్వాగతాన్ని అందుకున్నారు ముద్దుల జంట. .. శ్రీవారి దర్శన భాగ్య అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్నారు పండితుల వేద - అర్చనలు స్వీకరించి శేష వస్త్రాలను జంటకు అందించారు.. అటుపిమ్మట స్వామి వారి తీర్థ ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందించారు..

ఈ దర్శన అనంతరం రేపు పంజాబ్ లోని అమృతసర్ స్వర్ణ దేవాలయాన్ని కూడా దర్శించాలని ఈ జంట భావిస్తున్నారు.. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమ మాయలో మునిగి తుది గా ఒక్కటైనా ఈ జంట చూసే కన్నులకు కను విందు చేస్తుంది.. పెళ్లిళ్లు స్వర్గలలో నిర్ణయించబడతాయి అన్నడా నికి ఈ చూడచక్కని జంటే మంచి ఉదాహరణ.. వీరి ప్రేమానురాగాలు మరీన్నీ వివాహ వార్షికోత్సవాలను జరుపుకోవాల్సినదిగా కోరుకుందాం సగటు అభిమానులుగా ..

మరో వైపు శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ఉప సభ పతి కోన రఘుపతి గారు ,ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు కూడా దర్శించుకున్నారు.. ఈ ఉదయం VIP ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని దర్శన భాగ్యాన్ని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Ranveer Singh  Tirumala  Bollywood  

Other Articles