mammoottys mamangam has-a new release date to release on december 12 నాలుగు బాషల్లో ఒకే రోజున మమ్ముట్టి ‘మమాంగమ్’

Mammootty s mamangam has a new release date to release on december 12

Mamangam, Mammootty, Mamangam release date, Mamangam November 21, Mamangam December 12, Mollywood, Bollywood, Kollywood, Tollywood, movies, Entertainment

Mamangam starring Mammootty is touted to be one of the costliest Malayalam movies ever made on a massive budget of Rs 50 crore.. The historical war-drama, directed by M Padmakumar, produced by Venu Kunnappilly, was supposed to hit the theatres on November 21.

నాలుగు బాషల్లో ఒకే రోజున మమ్ముట్టి ‘మమాంగమ్’

Posted: 11/13/2019 02:38 PM IST
Mammootty s mamangam has a new release date to release on december 12

మలయాళంలో సీనియర్ స్టార్ హీరోగా మమ్ముట్టికి గల క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నటించిన చిత్రం విడుదల అవుతుందంటే.. మళయాలీ అభిమానులు బారులు తీరాల్సిందే. అయితే ఆయన నటిస్తున్న తాజా చిత్రంగా 'మమాంగమ్' ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.? అంటూ వేచిచూస్తున్న అభిమానులకు ఆయన ఒక షాక్ ఇచ్చారు. ఈ భారీ చారిత్రక చిత్రం.. భారీ బడ్జెట్ తో రూపోందుతుంది. దీంతో ఈ చిత్రాన్ని కూడా బహుబాషాలలో విడుదల చేయాలని చిత్రం యూనిట్ భావించింది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పలు బాషల్లో ఒకే సారి విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. జాతీయ బాష హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలో చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. దీంతో నాలుగు బాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే నవంబర్ 21న విడుదల కావాల్సిన ఈ చిత్రం తాజాగా మరో విడుదల తేదీని ప్రకటించింది. అందుకు చిత్రం పోస్టు ప్రోడక్షన్ పనులలో జాప్యమే కారణమని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ లో ప్రకటించింది.

ఒకనాటి సామాజిక పరిస్థితులు .. అప్పటి వేషధారణతో మమాంగమ్  సినిమా సాగనుంది. మలయాళంలో మమ్ముట్టి కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమైందని అంటున్నారు. మలయాళంతో పాటు తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నాలుగు భాషల్లోను డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. అత్యధిక థియేటర్స్ లో విడుదల కానున్న ఈ సినిమా, మమ్ముట్టి కెరియర్లోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles