Rajasekhar Escapes Unhurt in A Major Accidentఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా.. హీరో రాజశేఖర్

Hero dr rajasekhar escapes serious accident injury free

hero rajasekhar car accident, Dr Rajasekhar accident, rajasekhar suv accident, rajasekhar major accident, rajasekhar minor injuries, Rajasekhar, Accident, Car, Ramoji Film City, pedda Golkonda, benz suv, Outer Ring Road, tollywood latest update, Tollywood

In a shocking incident, actor Rajasekhar's car met with a major accident in the outskirts of Hyderabad, while returning from the shoot in Ramoji Film City. The suv reportedly overturned couple of times. The air bags have opened up saving Rajasekhar. He said to have escaped with minor injuries.

ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా.. హీరో రాజశేఖర్

Posted: 11/13/2019 12:04 PM IST
Hero dr rajasekhar escapes serious accident injury free

ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ ప్రమాదానికి గురయ్యారు. ఇవాళ తెల్లవారు జామున రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో అదుపుతప్పిన వాహనం ప్రమాదానికి గురైంది. శంషాబాద్ సమీపంలో అవుటర్ రింగ్ రోడ్ పై కారు అదుపుతప్పినట్టు సమాచారం. పెద్ద గోల్కొండ సమీపంలో కారు బోల్తా పడింది. సేఫ్టీ ఫీచర్స్ అధికంగా ఉన్న లగ్జరీ కారు కావడంతో, వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయి. దీంతో రాజశేఖర్ కారు ఘోర ప్రమాదం సంభవించినా.. ఆయన మాత్రం స్వల్పగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా ఈ ఘటనపై రాజశేఖర్ స్పందించారు. ప్రమాద సమయంలో కారుతో తాను ఒక్కడినే వున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు.

అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు` అని తెలిపారు. కారు ప్రమాదానికి గురైన సమయంలో తన భర్తకు సహాయం చేసిన వారికి జీవిత రాజశేఖర్ ధన్యావాదాలు తెలిపారు. దేవుడి చల్లగా చూడబట్టి, అదృష్టం కలిసొచ్చి కారు ప్రమాదం నుంచి రాజశేఖర్ క్షేమంగా బయటపడ్డారని, ఆయన అభిమానులు ఎలాంటి అందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Naga shourya s ashwathama fixes release date

    నాగశౌర్య ‘అశ్వథ్థామ’ విడుదల ముహూర్తం ఫిక్స్..

    Dec 11 | యువ కథానాయకుల రేసులో వెనుకబడిపోకుండా నాగశౌర్య తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్న ఆయన, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తన సొంత బ్యానర్లో నిర్మితమైన 'అశ్వథ్థామ' చిత్రం ద్వారా... Read more

  • Ala vaikunthapurramloo teaser well packaged entertainer

    ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ టీజర్..

    Dec 11 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ... Read more

  • Ram charan dedicates prestigeous award to noor ahmed

    అభిమానికి అపురూప కానుక అంకితమిచ్చిన చెర్రీ

    Dec 10 | మెగా అభిమాన సంఘం అధ్యక్షుడిగా అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మెగా స్టార్స్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన నూర్ అహ్మద్ ఆకస్మిక మృతితో దిగ్ర్భాంతికి గురైన మెగా పవర్ స్టార్ రామ్... Read more

  • Kotha bangaru lokam swetha basu files for divorce

    రోహిత్ మిట్టల్ తో భార్యభర్తల బంధానికి శ్వేతబసు బ్రేకఫ్

    Dec 10 | ప్రముఖ నటి శ్వేత బసు ప్రసాద్ సినీపరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని పట్టుమని పన్నెండు మాసాలు కూడా నిండకుండానే.. అమె అభిమానులు కలత చెందే నిర్ణయాన్ని తీసుకుంది. తన భర్తతో తన... Read more

  • Chhapaak trailer talk a hard hitting tale on acid attack victim

    అద్దంలో తనను తాను చూసుకొని బెదిరిపోయిన..

    Dec 10 | దాదాపు 14 సంవత్సరాల క్రితం.. దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీ అగర్వాల్‌పై యాసిడ్‌ దాడి జరిగింది. ‘ప్రేమ’ను నిరాకరించిందనే కోపంతో అందరూ చూస్తుండగానే ఆమెపై యాసిడ్‌ దాడి చేశాడో దుర్మార్గుడు. అతడి అకృత్యానికి లక్ష్మీ... Read more

Today on Telugu Wishesh