Sye Raa mints Rs 82 crore worldwide మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ రికార్డు.! తొలిరోజు వసూళ్ల ఎంతంటే..

Sye raa box office day 1 collection chiranjeevi s film mints rs 82 crore worldwide

Sye Raa Narasimha Reddy, Sye Raa 1st day collection, First day collections, Telugu states, sye raa narsimha reddy box office, sye raa chiranjeevi collections, chiranjeevi sye raa 1st day collections, Chiranjeevi, nayantara, amitabh bachchan, surender reddy, Chiranjeevi, Tollywood, Entertainment, Movies

Actor Chiranjeevi’s latest release Sye Raa Narasimha Reddy has struck gold at the box-office with opening day worldwide of around Rs 82 crore, trade analyst Girish Johar has revealed.

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ రికార్డు.! తొలిరోజు వసూళ్ల ఎంతంటే..

Posted: 10/03/2019 09:14 PM IST
Sye raa box office day 1 collection chiranjeevi s film mints rs 82 crore worldwide

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. చిరంజీవి నటశిఖరమని చలనచిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు, దర్శకులు కొనియాడుతున్నారు. మెగాస్టార్ నటవిశ్వరూపాన్ని ఈ చిత్రంలో ప్రదర్శించారని సినీ వర్గాల టాక్. అయితే టాక్ విషయాన్ని పక్కనబెడితే తొలిరోజు ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబట్టిందన్న విషయమై ఎక్కువగా ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.

చిరంజీవి 151వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం తొలిరోజు వసూళ్లలో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 38.76 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇవి రికార్డుస్థాయి వసూళ్లేనని అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సైరా నరసింహారెడ్డి బాక్సాఫీసులను షేక్ చేసింది. భారతీయ చిత్రాలలో అత్యధిక తొలిరోజు కలెక్షన్లను రాబట్టిన ఐదవ చిత్రంగా కూడా రికార్డును క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో 53 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ చిత్రం కర్ణటాకలో రూ.11 కోట్లు, తమిళనాడులో రూ.2కోట్లు, రెస్ట్ ఇండియాలో 3 కోట్లు, ఓవర్సీస్ లో 13 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి మొత్తంగా 82 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇక బాహుబలి 2 (214 కోట్లు), సాహో (127 కోట్లు) రోబో 2.0 (94 కోట్లు), కబాలి (88 కోట్లు) వసూళ్లు చేయగా, ఆ తరువాతి స్థానంలో సైరా (82 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచింది.

చిరంజీవి కెరియర్లో ఇది తొలి చారిత్రక చిత్రం కావడం.. దర్శకుడిగా తనకి వచ్చిన అవకాశాన్ని సురేందర్ రెడ్డి ఛాలెంజింగ్ గా తీసుకోవడం .. భారీ తారాగణం ఈ కథలో భాగస్వాములు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అన్ని రకాల ప్రత్యేకతల కలగలసి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని దీంతో వసూళ్లలోనూ దూసుకుపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు జీవిత చరిత్ర ఆధారంగా రూపోందిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు వెంకన్న పాత్రలో మెరిసాడు. ఇక నరసింహారెడ్డి బార్య పాత్రలో నయనతార నటించింది. వీరితో పాటు తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, నిహారిక, రాధాకిషన్ తదితరులు నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sye Raa  First day collections  Telugu states  Chiranjeevi  Ram Charan  Amitabh bachchan  Tollywood  

Other Articles