ఓడలు బళ్లు.. బళ్ళు ఓడలు కావడం ఇదే కాబోలు. దర్శకుడిగా వచ్చి హీరో అయిపోయాడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ హీరోగా మూడేళ్ల కింద వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో జాతీయ అవార్డు అందుకుని సంచలనం సృష్టించాడు తరుణ్ భాస్కర్. ఆ ఒక్క సినిమాతోనే ఈయన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఆ తర్వాత గతేడాది సురేష్ బాబు నిర్మాతగా కొత్త వాళ్లతో ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని తెరకెక్కించాడు. కానీ ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో మూడో సినిమాకు ఇంకా ముహూర్తం పెట్టలేదు తరుణ్.
ఈ గ్యాప్‌లోనే ఇప్పుడు నటుడిగా బిజీ అవుతున్నాడు ఈయన. ఇప్పటికే మహానటి, ఫలక్ నామా దాస్ లాంటి సినిమాల్లో నటించాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు ఏకంగా పూర్తిస్థాయి హీరోగా మారిపోతున్నాడు. హీరో విజయ్ దేవరకొండ తన కింగ్ ఆఫ్ హిల్ బ్యానర్‌లో కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా అంటూ వస్తున్న ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ హీరో. ఇప్పుడు విడుదలైన టీజర్ అదిరిపోయింది. నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కేస్తున్నాడు ఈయన.
ఈ చిత్రంలో హీరోగా తరుణ్ భాస్కర్ నటిస్తుంటే.. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక తరుణ్ భాస్కర్ జోడీగా తమిళ బ్యూటీ వాణి భోజన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది మీకు మాత్రమే చెప్తా. ఈ చిత్రంతోనే తొలిసారి విజయ్ దేవరకొండ తొలిసారి పూర్తిస్థాయి నిర్మాతగా మారిపోయాడు. అక్టోబర్‌లో విడుదల కానుంది ఈ చిత్రం.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more