Jayasudha entitled abhinaya Mayuri నటనాభినేత్రికి జయసుధకు ‘అభినయ మయూరి’ అవార్డు

Jayasudha entitled abhinaya mayuri

T Subbarami Reddy, TSR, actress Jayasudha, Abinaya Mayuri, Murali Mohan, Jamuna, Tollywood, Bollywood, movies, entertainment

Senior actress Jayasudha is set to be entitled Abinaya Mayuri by TSR Lalithakalaparishath Subbarami Reddy said that the honours will be done on his birthday which happens to be on September 17th.

నటనాభినేత్రి జయసుధకు ‘అభినయ మయూరి’ అవార్డు

Posted: 09/03/2019 09:06 PM IST
Jayasudha entitled abhinaya mayuri

సినీ పరిశ్రమ తీరుతెన్నులపై సీనియర్ నటి జయసుధ స్పందించారు. మహానటి అని మనం ఒక్కరినే పరిగణిస్తామని, కానీ ప్రతి ఒక్కరూ మహానటేనని, ఆ రేంజ్ లో నటించకపోతే ఇండస్ట్రీలో మనుగడ సాగించలేరని అభిప్రాయపడ్డారు. అందుకే తన దృష్టిలో అందరూ మహానటీమణులేనని అన్నారు. నటనాభినేత్రి జయసుధకు అభినవ మయూరి బిరుదును ఇస్తున్నట్లు కళాబంధు టీ  సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయసుధ మాట్లాడుతూ.. సీనియర్ తారలను గుర్తుపెట్టుకుని ప్రతి ఏడాది సత్కరించడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు.

ప్రముఖ వ్యాపారవేత్త టి.సుబ్బరామిరెడ్డి తన టీఎస్సార్ కళాపరిషత్ అవార్డుల ప్రకటన జ్యూరీ సభ్యులుగా వున్న సినీనటులు, నిర్మాత మురళీమోహన్, మొన్నటితరం నటి జమునలు జయసుధ అభినయ మయూరి అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సంధర్భంగా మాట్లాడిన సీనియర్ నటులు మురళీ మోహన్.. ఒకప్పుడు ప్రతీ సంవత్సరం అవార్డుల పండుగలు ఉండేవి అని, ఇటీవల కాలంలో అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాలు తగ్గిపోయాయని అన్నారు. అభినవ మయూరి బిరుదు అందుకోబోతున్న జయసుధను అభినందించారు.

ఆమెతో కలిసి పనిచేసిన సినిమాలను గుర్తుచేసుకున్న మురళీమోహన్.. ఆమె జీవితంలో జ్యోతి సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుందని ఆయన అన్నారు. జయసుధలో ఉన్న గొప్పతనం ఏంటంటే? ఆ క్యారెక్టర్ లోకి వెళ్లిపోతుందని, ప్రతీ ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉంటుందని, జయసుధ గారికి బిరుదు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతోమందికి సుబ్బిరామిరెడ్డి గారు ఇటువంటి అవార్డులు ఇవ్వాలని మురళీమోహన్ అన్నారు.

అలాగే ప్రభుత్వం తరుపున అవార్డులు ఇవ్వడం తగ్గిపోయిందాని, గత ప్రభుత్వం కానీ, ఇప్పటి ప్రభుత్వం కానీ ఆ దిశగా అడుగులు వెయ్యట్లేదని, ప్రభుత్వం ఇచ్చే అవార్డులు అంటే ఓ గౌరవం అని అందరూ భావిస్తారని, ఇప్పటి జగన్ ప్రభుత్వం అయినా గత నాలుగు ఏళ్ల నుంచి ఇవ్వవలసిన నంది అవార్డులను ఇస్తే బాగుంటుందని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. సీనియర్ నటి జమున మాట్లాడుతూ టీఎస్సార్ కళాపరిషత్ అవార్డుల ద్వారా సీనియర్ నటులను గుర్తుపెట్టుకుని సత్కారించడం ముదావహం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : T Subbarami Reddy  TSR  actress Jayasudha  Abinaya Mayuri  Murali Mohan  Jamuna  Tollywood  

Other Articles