విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకుసాగుతున్నాడు. అయితే ఇలా రోటీన్ గా వుంటే గుర్తింపు ఏముంటుందని భావించాడో ఏమో తెలియదు కానీ.. ఈ సారి సంక్రాంతికి తాను బరిలో నిలుస్తానని అంటున్నాడు. సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల ఫైట్ ఇప్పటికే హాట్ టాపిక్ గా సాగుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న నందమూరి హీరో కళ్యాణ్ ప్రస్తుతం ఎంత మంచి వాడవురా! అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.
శతమానం భవతి సినిమాతో 2017 సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఆ తరువాత నితిన్ తో చేసిన శ్రీనివాస కళ్యాణ్ బెడిసికొట్టింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ గా మళ్ళీ తన లక్కును పరీక్షించుకోబోతున్నాడు. అయితే పొంగల్ బరిలో ముందుగానే స్టార్ హీరోలు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అప్పుడే రాబోతోంది. అలాగే మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతికే రానుంది.
వీటితో పాటు మరో రెండు పెద్ద సినిమాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సూపర్ స్టార్ స్టైలిష్ స్టార్ అయితే సంక్రాంతికి రావాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో కల్యాణ్ రామ్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. టైటిల్ ను బట్టే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమని తెలుస్తోంది. కథాకథనాల పరంగా చూసుకుంటే ఇది తన కెరియర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు. మరి ఈ బిగ్ ఫైట్ లో ఏ హీరో క్లిక్కవుతాడో చూడాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more