త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 19వ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ టైటిల్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం‘నాన్న నేను’, ‘అలకనంద’ అనే టైటిల్స్ వినిపించిన విషయం తెలిసిందే.
కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి.
#AA19Title will be unveiled on 15th August! Stay tuned.#AA19Sankranthi2020@alluarjun #Trivikram @hegdepooja #NivethaPethuraj @MusicThaman #PSVinod @GeethaArts @vamsi84 @pnavdeep26 @iamSushanthA pic.twitter.com/sJjc56VMOp
— Haarika & Hassine Creations (@haarikahassine) August 12, 2019
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more