Sarileru Neekevvaru: Mahesh Intro on birthday అభిమానులకు ప్రిన్స్ గిఫ్ట్: ‘సరిలేరు నీకెవ్వరూ’..

Happy birthday mahesh babu sarileru neekevvaru intro unveiled

mahesh babu, prakash raj, anil ravipudi, rajendra prasad, ramya krishna, rashmika mandanna, Vijayashanti, Mahesh Babu-starrer Telugu, Sarileru Neekevvaru, entertainment, movies, tollywood

Telugu superstar Mahesh Babu is celebrating his birthday today and he has turned 44. Sarileru Neekevvaru is directed by Anil Ravipudi, which is slated to release on Sankranti 2020 and the shooting for the same is going on in full swing.

అభిమానులకు ప్రిన్స్ గిఫ్ట్: ‘సరిలేరు నీకెవ్వరూ’..

Posted: 08/09/2019 06:28 PM IST
Happy birthday mahesh babu sarileru neekevvaru intro unveiled

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. శుక్రవారం మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం సినిమాలోని మహేశ్‌బాబు పాత్రను పరిచయం చేసింది. ఇందులో మహేశ్‌ ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ అంటూ వినిపించిన బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ అభిమానులను అలరిస్తోంది.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పటి అగ్ర కథానాయిక విజయశాంతి, నటుడు బండ్ల గణేశ్‌లు ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  rashmika mandanna  Vijayashanti  anil ravipudi  Sarileru Neekevvaru  Tollywood  

Other Articles