Samantha hikes fees stands after Nayantara అమ్మో సమంత.. మరీ అంత.? నయన్ వెంట..

Samantha s camp unhappy with fee hike rumours

Nayanthara, Samantha, Renumeration, fee hike, samantha camp, Oh Baby, lady oriented movies, Tamil Cinema, Telugu Cinema, Kollywood, Tollywood

After Samantha Akkineni's 'Oh Baby' has become a huge hit, it has been rumoured that the star actress has doubled her fee.

అమ్మో సమంత.. మరీ అంత.? నయన్ వెంట..

Posted: 07/27/2019 09:22 PM IST
Samantha s camp unhappy with fee hike rumours

తెలుగు సినిమా సహా దక్షిణాధిన తన అభిమానులను అంతకంతకూ పెంచుకుంటూ సీని ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంటున్న సమంత టామ్ హీరోయిన్ గా తన స్థానాన్ని మరింత పథిలం చేసుకుంటోంది. అయితే దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావించిందో ఏమో తెలియదు కానీ తన తాజా చిత్రం ఓ బేబి చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు అటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను అందుకుంది.

రంగస్థలం నుంచి పూర్తిగా నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలలోనే నటిస్తు.. అభిమానుల హృదయాలను కొల్లగోడుతొంది. ఒకప్పుడు హీరోల సరసన ఆడిపాడటానికే పరిమితం అయ్యే సమంత.. పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై దృష్టి సారించింది. గతేడాది ‘యూటర్న్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సమంత.. అ ఇయర్ మాత్రం తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబి’తో మరో సక్సెస్ అందుకుంది.

ఈ సినిమాల తర్వాత సమంత తన పారితోషకాన్ని అమాంతం పెంచేసినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు రూ. 2కోట్లు తీసుకున్న సమంత.. తాజాగా తన పారితోషకాన్ని కోటి పెంచి రూ. 3 మూడు కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక రెమ్యూనరేషన్ విషయంలో సౌత్‌లో ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటూ నయనతార టాప్‌లో ఉంది. ఆమె కూడా ఒక వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే..మరోవైపు మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ ఈ రేంజ్‌కు చేరుకుంది. దీంతో ఈ వార్త తెలిసిన నిర్మాతలు అమ్మో సమ్+అంతా అంటూ చలోక్తులు విసురుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Samantha  Tamil Cinema  Telugu Cinema  Kollywood  Tollywood  

Other Articles