C.Kalyan pannel wins in Telugu Film Chamber Elections ఫిలించాంబర్ ఎన్నికల్లో సి.కళ్యాణ్ ప్యానెల్ ఘనవిజయం

C kalyan pannel wins in telugu film chamber elections

C Kalyan, Dil Raju, Nandamuri Balakrishna, Telugu Film Chamber, Emtertainment, movies, Tollywood

Producer C Kalyan has proved that he has bigger influence and clout among the producers, exhibitors, and distributors than the other active producers. In the polls held for Telugu Film Chamber, producer C Kalyan’s panel won hands down securing a total of nine EC members.

ఫిలించాంబర్ ఎన్నికల్లో సి.కళ్యాణ్ ప్యానెల్ ఘనవిజయం

Posted: 07/27/2019 07:16 PM IST
C kalyan pannel wins in telugu film chamber elections

పోటాపోటీగా తీవ్ర ఉత్కంఠల నడుమ సాగిన ఫిలించాంబర్ ఎన్నికల్లో సి. కల్యాణ్ నేతృత్వంలోని 'మన ప్యానెల్' వర్గం ఘనవిజయం సాధించింది. 12 మంది ఈసీ మెంబర్స్ లో 'మన ప్యానెల్' తరఫున  9 మంది విజయం సాధించగా, ప్రత్యర్థి వర్గం 'యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ' ప్యానెల్ లో కేవలం దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ మాత్రమే గెలిచారు.  ఇండిపెండెంట్ గా బరిలో దిగిన మోహన్ గౌడ్ కూడా విజయం సాధించారు.

ఇక, 20 మంది సెక్టార్ మెంబర్స్ లో 'మన ప్యానెల్' హవా కొనసాగింది. సి కళ్యాణ్ కు చెందిన మన ప్యానెల్ నుంచి 16 మంది గెలుపొందగా, దిల్ రాజుకు చెందిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ తరఫున నలుగురు మాత్రమే విజయం సాధించారు. 'మన ప్యానెల్' నుంచి వైవీఎస్ చౌదరి, నట్టి కుమార్, మోహన్ వడ్లపట్ల, ఎం.శివకుమార్, కేశవరావు, సాగర్ తదితరులు పోటీ చేశారు. 'యాక్టివ్ ప్రొడ్యూసర్స్' ప్యానెల్ తరఫున దిల్ రాజు, డీవీవీ దానయ్య, పోటీ చేశారు.

వీరితో పాటు కొర్రపాటి సాయి, రవిశంకర్, దామోదర్ ప్రసాద్, ఆచంట గోపీనాథ్, కేకే రాధామోహన్, శివలెంక కృష్ణప్రసాద్, భోగవల్లి ప్రసాద్ తదితరులు పోటీ చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంటకు పూర్తయింది. ఫిలిం చాంబర్‌లో నిర్మాతలు, స్టూడియో యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భాగస్వాములుగా ఉన్నారు. నాలుగు విభాగాల్లో ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఒక్కో విభాగం నుంచి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం ఆనవాయితీగా వస్తోంది.

గత కొన్నేళ్ళుగా కొనసాగుతున్న సంప్రదాయం మేరకు ఈ సారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎగ్జిబిటర్స్‌ విభాగం నుంచి నారాయణ దాస్‌ నారంగ్‌ను ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్‌ ప్రెసిడెంట్లుగా దిల్‌ రాజు, ముత్యాల రామదాసులను, సెక్రటరీగా దామోదర్‌ ప్రసాద్‌, జాయింట్‌ సెక్రటరీగా నట్టికుమార్‌, భరత్‌ చౌదరిలు, ట్రెజరర్‌ గా విజయేందర్‌ రెడ్డిలు ఎన్నికయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : C Kalyan  Dil Raju  Nandamuri Balakrishna  Telugu Film Chamber  Tollywood  

Other Articles