Nutan Naidu leaked details of BigBoss-3 contestants బిగ్ బాస్-3కి ముందే లీక్ వీరుల బెడద.. కంటెస్టెంట్స్ వీళ్లేనట..!

Ex participant leaked the contestants details of bigboss 3

nutan naidu, Ex-participant, bigboss-3, Big boss Telugu, Big boss-3 contestants, Big boss telugu season 3, movies, entertainment, tollywood

Ex-participant of Big boss Telugu, Nutan Naidu who had taken part in season 2 had revealed the details of Bigboss contestants in season 3.

బిగ్ బాస్-3కి ముందే లీక్ వీరుల బెడద.. కంటెస్టెంట్స్ వీళ్లేనట..!

Posted: 07/20/2019 04:28 PM IST
Ex participant leaked the contestants details of bigboss 3

తెలుగు బిగ్‌బాస్ షో అనగానే తెలుగు ప్రేక్షకులలో ఓ క్రేజ్. దీనికి తోడు కంటెస్టంట్స్ అల్లర్లను ఏ రోజుకా రోజు మనకు చూపించే హోస్ట్ ల, వారు వివరించే విధానాలు మరో అదనం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న తరుణంలో.. ఈ షోకు అప్పుడే లీక్ వీరుల బెడత మొదలైంది. సీజన్ వన్ లో ఎలాంటి లీకులు లేకుండా సాగినా.. రెండో సీజన్ లో మాత్రం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్న లీక్ లు బయటకొచ్చాయి.

ఇక ప్రస్తుతం అవిష్కరణకు సిద్దంగా వున్న బిగ్ బాస్-3 సీజన్ లో ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోకుండానే లీక్ వీరుల బెడద ప్రారంభమైంది. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉన్నా.. లీక్ వీరులు ఆ వివరాలను బట్టబయలు చేశారు. అయితే అందులోనూ మరీ ముఖ్యంగా గత షో పార్టిసిపెంట్ నూతన్ నాయుడు బయటపెట్టడం విశేషం.

బిగ్‌బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ జాబితా తనకు ఎలా వచ్చిందీ చెప్పని నూతన్ నాయుడు.. రేపటి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టేది మాత్రం కచ్చితంగా వీళ్లేనని చెబుతున్నాడు. అంత కచ్చితంగా చెబుతున్నాడెంటా.? అనుకోవడం తరువాత కానీ.. ఇంతకీ కంటెస్టెంట్స్ ఎవరు అని అడుగుతున్నారా.. ఇంకెందుకు ఆలస్యం మీరు చదివేయండీ..

నూతన్ నాయుడు వెల్లడించిన పేర్లలో నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్-వితికా షెరు(జంట), సీరియల్ నటుడు రవికృష్ణ, సీరియల్ యాక్టర్ అలీ రెజా, టీవీ9 న్యూస్ యాంకర్ జాఫర్, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్, సీరియల్ నటి రోహిణి, డబ్‌స్మాష్ స్టార్ అశు రెడ్డి ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles